Anant Mahadevan Shocking :బాహుబలి..పుష్ప మూవీస్ కు అంత సీన్ లేదు

స్టార్ ద‌ర్శ‌కడు అనంత్ మ‌హ‌దేవ‌న్ కామెంట్స్

Anant Mahadevan : స్టార్ ద‌ర్శ‌కుడు అనంత్ మ‌హ‌దేవ‌న్(Anant Mahadevan) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. ద‌క్షిణాది సినిమాలు వ‌రుస‌గా హిట్ కావ‌డం, పాన్ ఇండియా లెవ‌ల్లో సూప‌ర్ హిట్ అందుకోవ‌డం ప‌ట్ల నోరు పారేసుకున్నాడు. ప్ర‌త్యేకించి ఎస్ఎస్ రాజ‌మౌళి తీసిన బాహుబ‌లి, బాహుబ‌లి2, సుకుమార్ తీసిన పుష్ప , పుష్ప‌2 చిత్రాలు బాక్సులు బ‌ద్ద‌లు కొట్టాయి. సెన్సేష‌న్ క్రియేట్ చేశాయి. పుష్ప 2 అయితే బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఏకంగా రూ. 1867 కోట్లు వ‌సూలు చేసింది. అత్య‌ధిక వ‌సూళ్లు చేసిన రెండో భార‌తీయ చిత్రంగా రికార్డ్ బ్రేక్ చేసింది.

Director Anant Mahadevan Shocking Comments

ఇక బాహుబ‌లి కూడా అదే లెవ‌ల్లో క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసింది. అయితే ఈ రెండు సినిమాల‌పై తన అభిప్రాయాన్ని వ్య‌క్తం చేశారు అనంత మ‌హ‌దేవ‌న్. ఆయ‌న జాతీయ స్థాయిలో అవార్డు పొందారు. ఆ సినిమాల‌లో క‌థ ఏమీ లేదు. చెప్పు కోవ‌డానికి ఏముందంటూ ఎద్దేవా చేశారు. వాటికి ప్ర‌త్యామ్నాయంగా సినిమాలు లేక పోవ‌డం వ‌ల్ల గ‌త్యంతరం లేక బాహుబ‌లి, పుష్ప మూవీస్ ను చూశారంటూ ఎద్దేవా చేశారు .

త‌న దృష్టిలో ఈ రెండు చిత్రాలు గొప్ప మూవీస్ కాదంటూ స్ప‌ష్టం చేశాడు. ఏమున్నాయి అందులో చెప్పుకోవ‌డానికి అంటూ ప్ర‌శ్నించారు. ద‌క్షిణాది చిత్రాల‌కు పెద్ద ఎత్తున బాలీవుడ్ లో ఆద‌ర‌ణ ద‌క్క‌డం ప‌ట్ల స్పందించాడు. ప్రేక్ష‌కుల వ‌ర‌కు వ‌స్తే మ‌రో ఛాయిస్ లేక పోవ‌డంతో త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితుల్లో బాహుబ‌లి, పుష్ప చిత్రాల‌ను చూడాల్సి వ‌చ్చింద‌న్నారు. పెద్ద ఎత్తున వ‌సూళ్లు సాధించినంత మాత్రాన అవి మంచి సినిమాలు ఎలా అవుతాయంటూ నిప్పులు చెరిగారు ద‌ర్శ‌కుడు అనంత మ‌హాదేవ‌న్.

Also Read : Hero Nani-Hit 3 :చాగంటి సందేశం హిట్ 3 ట్రైల‌ర్ హింసాత్మ‌కం

Anant MahadevanCommentsShockingViral
Comments (0)
Add Comment