Anand Mahindra: ‘కల్కి 2898 ఏడీ’ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ పై ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు !

‘కల్కి 2898 ఏడీ’ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ పై ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు !

Anand Mahindra: మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా… ప్రభాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ సినిమా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ పై ప్రశంసలు కురిపించారు. ఆయన్ను చూస్తుంటే గర్వంగా ఉందన్నారు. ఈ మేరకు ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా పోస్ట్‌ పెట్టారు. గతంలో తన సాయం కోరుతూ నాగ్‌ అశ్విన్‌ పెట్టిన ట్వీట్‌ స్క్రీన్‌ షాట్‌ను షేర్‌ చేస్తూ… ‘‘వాస్తవానికి సరదా సంగతులు ‘ఎక్స్‌’ లోనే కనిపిస్తాయి. నాగ్‌ అశ్విన్‌, అతడి టీమ్‌ గొప్పగా ఆలోచించడానికి భయపడరు. వారిని చూస్తుంటే గర్వంగా ఉంది. అధునాతన వాహనాలు తయారు చేయడంలో ‘కల్కి’ చిత్ర బృందానికి చెన్నైలోని ‘మహీంద్రా రీసెర్చ్‌ వ్యాలీ’ టీమ్‌ సహాయపడింది. ‘బుజ్జి’ వాహనం రెండు మహీంద్రా ఇ- మోటర్లతో నడుస్తుంది. జయం ఆటోమోటివ్స్‌ కూడా ఈ వెహికల్‌ రూపొందించడంలో భాగమైంది’’ అని తెలిపారు. మహీంద్రా ట్వీట్‌పై దర్శకుడు స్పందిస్తూ… అసాధ్యం అనుకున్న కలను సుసాధ్యం చేశారంటూ థాంక్స్‌ చెప్పారు. ‘కలలు కనడం మానొద్దు..’ అంటూ మహీంద్రా రిప్లై ఇచ్చారు.

Anand Mahindra Comment

ప్రభాస్‌ ప్రధాన పాత్రలో నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’. ఇతిహాసాలతో కూడిన ఫ్యూచరిస్టిక్ సైన్స్‌ ఫిక్షన్‌ గా రూపొందిన ఈ సినిమాలో విభిన్నమైన వాహనాలు కీలకం. వాటిని రూపొందించేందుకు అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీని వినియోగించాల్సి వచ్చింది. దీనితో ఈ సినిమా ప్రారంభ సమయంలో డైరెక్టర్‌… ఆనంద్‌ మహీంద్రా(Anand Mahindra)ను ‘ఎక్స్‌’ వేదికగా సాయం చేయాలని కోరారు. దానిపై ఆయన సానుకూలంగా స్పందించారు. అలా అధునాతన సాంకేతికతో ‘బుజ్జి’ అనే వాహనాన్ని తయారు చేశారు. ‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ఉపయోగించిన ఈ బుజ్జి అనే వాహన్ని హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రేక్షకులకు పరిచయం చేసారు. ఈ సందర్భంగా బుజ్జి పరిచయ వీడియో క్లిప్పింగ్‌ ను పోస్ట్‌ చేస్తూ ఆనంద్‌ మహీంద్రా కొనియాడారు. ఇతిహాసాలతో ముడిపడిన ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. జూన్‌ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read : Yakshini Series : మంచు లక్ష్మి నటించిన ‘యక్షిణి’ సిరీస్ నుంచి జ్వాలా లుక్

Anand MahindraKalki 2898 ADNag Ashwin
Comments (0)
Add Comment