Amy Jackson : బ్రిటీష్ మోడల్, ఇండియన్ నటి అమీ జాక్సన్(Amy Jackson) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. రజనీకాంత్ రోబో,ధనుష్ నవవసంతం, రామ్ చరణ్ ఎవడు, విజయ్ తేరి , విక్రమ్ ఐ సినిమాలతో ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. బాలీవుడ్‌లోనూ వరుసగా సినిమాలు చేస్తూ ప్రేమ, పిల్లలు, పెళ్లి అంటూ తన కేరీర్‌ను పక్కన పెట్టేసి కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉంది. ఇప్పటికే బాలీవుడ్లో ఒకరితో బ్రేకప్ చెప్పి మరొక విదేశియుడు (జార్జ్ పనాయోటౌ) తో డేటింగ్ చేసి బిడ్డను కని పెళ్లి చేసుకున్న ఈ ముద్దుగుమ్మ రెండేండ్లకే ఆ బంధానికి గుడ్‌బై చెప్పింది.
Amy Jackson Family..
ఆపై ఈ ఏడాది ఆరంభంలో ‘గాసిప్ గర్ల్’ అనే షో ద్వారా పాపులర్ అయిన ఎడ్వర్డ్ జాక్ పీటర్ వెస్ట్విక్ అనే ఓ హాలీవుడ్ నటుడితో ప్రేమాయణం ప్టార్ట్ చేసిన ఈ బ్యూటీ జనవరిలో ఎంగేజ్మెంట్, ఆగస్టులో ఇటలీలో పెళ్లి చేసుకుంది. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అంటూ చెప్పి వార్తల్లో ట్రెండింగ్ అవుతోంది. పెళ్లయిన రెండు నెలలకు బేబీ బంప్ ఫోటోలు షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఇప్పటికే తన మాజీ భర్త జార్జ్ పనాయోటౌ నుంచి దూరమయ్యాక తన ఐదేళ్ల కొడుకు ఆండ్రియాస్ పనాయోటౌను అమీ అల్లారు ముద్దుగా పెంచుకుంటుంది. తాజాగా ఇప్పుడు ఎడ్ వెస్ట్ విక్ తో బిడ్డను కంటోంది.
ఈ వార్తను అమీజాక్సన్ సోషల్ మీడియా ద్వారా పంచుకోగా ఆమె అభిమానులు, పలువురు సెలబ్రిటీస్ అమీ జాక్సన్(Amy Jackson)కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 2018లో వచ్చిన రోబో 2, కన్నడలో విలన్ అనే చిత్రాల తర్వాత అరేండ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ సుందరి ఈ సంవత్సరమే మిషన్ అనే తమిళ చిత్రం, క్రాక్ అనే హిందీ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చి మెప్పించింది.. ప్రస్తుతం చేతిలో ఏ సినిమా లేదు.
Also Read : Malavika Mohanan : తన కల ఇప్పుడు నెరవేరిందంటున్న హీరోయిన్ మాళవిక