Amy Jackson: కొంతకాలంగా ప్రేమలో ఉన్న నటి అమీ జాక్సన్, హాలీవుడ్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్ వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. వీరి పెళ్లి వేడుక ఇటలీలో ఘనంగా జరిగింది. సోషల్ మీడియా వేదికగా ఇరువురు తమ వెడ్డింగ్ పిక్స్ పోస్ట్ చేశారు. ‘కొత్త ప్రయాణం ఇప్పుడే మొదలైంది’ అంటూ అభిమానులకు పెళ్లి కబురు చెప్పారు.
Amy Jackson MarriageAmy Jackson
ఇంతకుముందు జార్జ్ పనియోటౌ అనే వ్యాపారవేత్తతో అమీ జాక్సన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. కొంతకాలంపాటు సహజీవనంలో ఉన్న ఆ జంటకు ఆండ్రూ అనే బాబు కూడా జన్మించాడు. అమీ-జార్జ్ 2020లో వివాహం చేసుకోవాలని భావించగా… కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. అయితే, ఆ తర్వాత పరిస్థితుల నేపథ్యంలో వాళ్లిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయినట్టు అప్పట్లో వార్తలొచ్చాయి. సౌదీ అరేబియాలో జరిగిన ఓ ఫిలిం ఫెస్టివల్‌లో ఎడ్‌ను తొలిసారి కలిశారు అమీ. అదే సమయంలో వీరి మధ్య పరిచయం ఏర్పడింది.
‘ఎవడు’, ‘ఐ’, ‘2. ఓ’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించారు అమీ జాక్సన్. ఆమె నటించిన ‘మిషన్: ఛాప్టర్ 1’ (తమిళ్), ‘క్రాక్’ (హిందీ) ఈ ఏడాదిలోనే విడుదలయ్యాయి. తాజాగా ఆమె పెళ్లి చేసుకుని వివాహబంధంలోనికి అడుగుపెట్టింది.
Also Read : Nagarjuna : ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై కీలక ప్రకటన చేసిన నాగార్జున