Amritha Aiyer : తన పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్ ‘అమృత అయ్యర్’

వచ్చేఏడాది కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని తెలిపింది...

Amritha Aiyer : టాలీవుడ్ హీరోయిన్ అమృత అయ్యర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. హనుమాన్ సినిమాతో భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో ఈ అమ్మడుకు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. హనుమాన్ సినిమా తర్వాత వరుస సినిమాల్లో నటించే అవకాశాలు అందుకుంది. తెలుగులోనే కాకుండా అటు తమిళంలోనూ సినిమాల్లో నటిస్తుంది. ప్రస్తుతం అల్లరి నరేశ్ హీరోగా నటించిన బచ్చలమల్లి సినిమాలో కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమా డిసెంబ్ 20న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ జోరుగా నిర్వహిస్తుంది చిత్రయూనిట్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమృతా తన పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

Amritha Aiyer Comments

వచ్చేఏడాది కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని తెలిపింది.కానీ ఇండస్ట్రీకి చెందిన అబ్బాయిని మాత్రం అస్సలు మ్యారేజ్ చేసుకోనని.. సినీరంగానికి అసలు సంబంధమే లేని వ్యక్తిని చేసుకుంటానని చెప్పుకొచ్చింది. ఇద్దరిదీ ఒకే ఫీల్స్ అయితే పెళ్లి తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయని.. అందుకే ఇండస్ట్రీకి చెందిన అబ్బాయిని వద్దు అనుకుంటున్నానని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీ కాకుండా వేరే ఫీల్డ్ అయితే అన్ని విషయాలు ఒకరితో ఒకరు షేర్ చేసుకోవచ్చని తెలిపింది.

Also Read : Chay-Sobhita : నాగ చైతన్య, శోభితల ప్రేమ పెళ్లి వరకు ఎలా వచ్చింది…

Amritha AiyerCommentsTrendingUpdatesViral
Comments (0)
Add Comment