Amrita Pandey: భోజ్ పురి సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ నటి అమృతా పాండే(Amrita Pandey) ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం బీహార్ లోని భాగల్ పూర్‌లోని తన అపార్ట్ మెంట్‌లో శవమై కనిపించింది. ఆమె తన గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. అమృత పాండే ప్రస్తుతం తన భర్తతో కలిసి ముంబయిలో నివసిస్తోంది. అయితే ఇటీవల భాగల్పూర్ లో బంధువుల వివాహానికి వెళ్లింది. ఇంతలోనే ఇలా జరిగింది. శనివారం అమృతా తన వాట్సాప్ స్టేటస్ పై ఓ నోట్‌ను పోస్ట్ చేసింది. అది పోస్ట్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే తన గదిలో విగతజీవిలా కనిపించింది. ఈ సంఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆమె కుటుంబ సభ్యులు తాను డిప్రెషన్‌లో ఉన్నట్లు చెబుతున్నారు.
Amrita Pandey No More
అమృతా పాండే కెరీర్ విషయానికొస్తే… ఖేసరి లాల్ యాదవ్ తో కలిసి ‘దీవానాపన్’ చిత్రంతో తొలిసారిగా నటించింది. ఈ భోజ్‌పురి చిత్రంలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా నచ్చింది. ఆ తర్వాత 2022లో ఛత్తీస్‌గఢ్ లోని బిలాస్ పూర్ కు చెందిన చంద్రమణి ఝంగ్డేను వివాహం చేసుకుంది. పెళ్లయ్యాక వీరిద్దరు ముంబైలోనే నివాసముంటున్నారు.
Also Read : Sonu Sood: ఆగిపోయిన సోనూ సూద్ వాట్సాప్ ! 61 గంటల్లో 9,483 మెసేజ్ లు !