Ammoru Thalli: నయనతార హిట్‌ సినిమాకు సీక్వెల్‌ ! దర్శకుడిని మార్చేసిన మేకర్స్‌ !

నయనతార హిట్‌ సినిమాకు సీక్వెల్‌ ! దర్శకుడిని మార్చేసిన మేకర్స్‌ !

Ammoru Thalli: లేడీ సూపర్ స్టార్ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన సినిమా ‘మూకుత్తి అమ్మన్‌’ (తెలుగులో అమ్మోరు తల్లి(Ammoru Thalli)). వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ బ్యానర్ పై ఐసరి కె.గణేష్‌ నిర్మించిన ఈ సినిమాకు ఆర్జే బాలాజీ, ఎన్‌.జె.శరవణన్‌ దర్శకత్వం వహించారు. నయనతార, ఆర్జే బాలాజీ, ఊర్వశి, స్మృతి వెంకట్‌, మధు, అభినయ, అజయ్ ఘోష్, తిరునవక్కరసు, మౌళి ప్రధాన పాత్రల్లో నటించారు. 2020లో తమిళ ఫ్యాంటసీ కామెడీ డ్రామా ‘మూకుత్తి అమ్మన్‌’గా డైరెక్ట్ గా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాను… తెలుగులో అమ్మోరు తల్లి(Ammoru Thalli) పేరుతో డబ్బింగ్‌ చేసి విడుదల చేశారు. తాజాగా ఈ ‘మూకుత్తి అమ్మన్‌’కు సీక్వెల్‌ గా ‘మూకుత్తి అమ్మన్‌ 2’ ను తెరకెక్కిస్తున్నారు.

Ammoru Thalli Sequel…

‘మూకుత్తి అమ్మన్‌’కు సీక్వెల్‌ గా తెరకెక్కిస్తున్న ‘మూకుత్తి అమ్మన్‌ 2’ లో కూడా నయనతార ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అయితే, సీక్వెల్‌ కోసం దర్శకుడిని తాజాగా మార్చేశారు. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. ‘ముకుత్తి అమ్మన్‌ 2’ చిత్రాన్ని తమిళ దర్శకుడు సుందర్‌. సి డైరెక్షన్‌ చేస్తారని తాజాగా ప్రకటించారు. ఈ సినిమాకు సీక్వెల్‌ను కొద్దిరోజుల క్రితమే ప్రకటించారు. ఇందులో కూడా నయనతారయే లీడ్‌ రోల్‌ చేస్తారని, వేల్స్‌ ఫిల్మ్‌ ఇంటర్‌నేషనల్‌ సంస్థ గతంలో ప్రకటించింది. అయితే, డైరెక్టర్‌ పేరును మాత్రం ఆ సమయంలో రివీల్‌ చేయలేదు. అయితే తాజాగా నటుడు, దర్శకుడు సుందర్‌. సి ఈ సినిమాను తెరకెక్కించనున్నారని ఒక పోస్టర్‌తో మేకర్స్‌ తెలిపారు. అరణ్మనై-4 తెలుగులో (బాకు) సినిమాతో రీసెంట్‌గా ఆయన సూపర్‌ హిట్‌ అందుకున్నారు సుందర్‌. సి. ఈ నేపథ్యంలో ‘మూకుత్తి అమ్మన్‌ 2’ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

‘మూకుత్తి అమ్మన్‌’ చిత్రంలో నయనతార టైటిల్‌ రోల్‌ చేయగా, దర్శకుడు, నటుడు ఆర్జే బాలాజీ మరో లీడ్‌లో నటించారు. ఎన్‌జే శరవణన్‌ తో కలిసి ఆర్‌ జే బాలాజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2020లో ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం డిస్నీ హాట్ స్టార్ లో డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దీనితో తాజాగా ‘మూకుత్తి అమ్మన్‌ 2’ పనులను మొదలు పెట్టారు. అయితే తాజాగా ఈ సినిమా దర్శకుడిని మారుస్తూ చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది.

Also Read : Aishwarya Rajesh: కోలీవుడ్ కు హేమా కమిటీలు అవసరం లేదు – నటి ఐశ్వర్య రాజేశ్‌

Ammoru ThalliNayanthara
Comments (0)
Add Comment