Amitabh Bhachchan : బ‌న్నీ డ్యాన్స్ కు బిగ్ బి ఫిదా

శ్రీ‌వ‌ల్లి పాట‌లో స్టెప్పులు అదుర్స్

Amitabh Bhachchan : టాలీవుడ్ నుంచి జాతీయ స్థాయిలో ఉత్త‌మ న‌టుడిగా అవార్డు పొందిన అల్లు అర్జున్ పై ప్ర‌శంస‌లు కురిపించారు ప్ర‌ముఖ బాలీవుడ్ సినీ దిగ్గ‌జం అమితాబ్ బ‌చ్చ‌న్. త‌ను పుష్ప ది రైజ్ చూశాన‌ని తెలిపారు. ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ అద్భుత‌మ‌ని ఇదే స‌మ‌యంలో బ‌న్నీ న‌టించిన తీరు త‌న‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంద‌న్నాడు.

Amitabh Bhachchan Praises Allu Arjun

ఇందులో శ్రీ‌వ‌ల్లి పాట త‌న‌ను విస్తు పోయేలా చేసింద‌న్నాడు. విచిత్రం ఏమిటంటే ఈ పాటకు సంబంధించి వేసిన స్టెప్పులు త‌న‌ను మ‌రింత ఆక‌ర్షించేలా చేశాయ‌ని పేర్కొన్నాడు అమితాబ్ బ‌చ్చన్(Amitabh Bhachchan). ప్ర‌స్తుతం బిగ్ బీ చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి నెట్టింట్లో.

హిందీలో వ‌చ్చిన పుష్ప రాజ్ మూవీలో బ‌న్నీకి జావెద్ అలీ పాడారు. బ‌న్నీ, ర‌ష్మిక మంద‌న్నా న‌టించారు. నేను చాలా సినిమాల‌లో న‌టించాను. కానీ ఈ పాట‌కు వాడిన స్టెప్పులు త‌న‌ను మ‌రింత ఆనందాన్ని క‌లిగించేలా చేశాయ‌న్నాడు బిగ్ బి.

చాలా మంది శ్రీ‌వ‌ల్లి సాంగ్ ను అనుస‌రించారు. అంతే కాదు ఇందులో బ‌న్నీ స్లిప్ప‌ర్స్ వాడాడు. ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రు ఆ ర‌క‌మైన స్లిప్ప‌ర్స్ వాడ‌డం మొద‌లు పెట్టారంటూ తెలిపారు. కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి 15 షో ప్రారంభం కానుంది. ఇందులో ఓ ప్ర‌శ్న‌కు స‌మాధానంగా అమితాబ్ ఇలా చెప్పారు.

ALso Read : Aamir Khan: ఆమిర్ ఖాన్ ఇంట పెళ్ళి సందడి

Comments (0)
Add Comment