Amitabh Bachchan: పెళ్లికి ముందే తన భార్య జయా బచ్చన్ కు కండీషన్‌ పెట్టిన బిగ్‌ బీ అమితాబ్ ?

పెళ్లికి ముందే తన భార్య జయా బచ్చన్ కు కండీషన్‌ పెట్టిన బిగ్‌ బీ అమితాబ్ ?

Amitabh Bachchan: పెళ్లయ్యాక భార్య ఇంటిపట్టునే ఉండాలని, ఉద్యోగం చేయకూడదని ఆంక్షలు పెట్టేవారు చాలామంది ఉంటారు. అందులో బాలీవుడ్‌ లెజెండ్‌ అమితాబ్‌ బచ్చన్‌ కూడా ఉన్నాడట. ఇదే విషయాన్ని ఆయన సతీమణి, నటి జయా బచ్చన్‌ తాజాగా వెల్లడించింది. అలాగే తన పెళ్లి ముచ్చట్లు చెప్పింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ… మేము అక్టోబర్‌లో పెళ్లి చేసుకోవాలన్నాం. అదే నెల ఎందుకు ఎంచుకున్నామంటే అప్పటికి నేను ఒప్పుకున్న ప్రాజెక్టులు పూర్తయిపోతాయని.

Amitabh Bachchan…

అంతేకాదు అమితాబ్‌ బచ్చన్‌(Amitabh Bachchan) తన సతీమణి జయా బచ్చన్‌ కు పెళ్లికి ముందే కొన్ని కండిషన్స్‌ పెట్టారట. వివాహం తర్వాత వృత్తి కంటే కుటుంబానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. ఈ విషయాన్ని జయాబచ్చన్‌ స్వయంగా తెలియజేశారు. ‘‘పెళ్లి నాటికి నేను నటిగా రాణిస్తున్నా. వరుస సినిమాలతో కెరీర్‌ పరంగా బిజీగా ఉన్నా. వృత్తిపరమైన కమిట్‌ మెంట్స్‌ పూర్తి చేసుకొని 1973 అక్టోబర్‌లో పెళ్లి చేసుకోవాలని మేమిద్దరం తొలుత నిర్ణయించుకున్నాం.

అదే సమయంలో ఆయన నాకొక కండిషన్‌ పెట్టారు. 9-5 షిఫ్టుల్లో వర్క్‌ చేసే సతీమణి తనకు వద్దన్నారు. వర్క్‌ చేయడానికి అంగీకరించారు కానీ, రోజూ షూటింగ్స్‌ కు వెళ్లడానికి వీల్లేదన్నారు. మంచి ప్రాజెక్ట్‌లు ఎంచుకొని, సరైన మనుషులతో వర్క్ చేయాలని తెలిపారు. ‘జంజీర్‌’ సక్సెస్‌ తర్వాత మేమిద్దరం టూర్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం. ఆ విషయం వాళ్లింట్లో తెలిసింది. పెళ్లికి ముందు ఇలాంటి విహారయాత్రలకు వెళ్లడానికి వీల్లేదన్నారు. జూన్‌ లోనే పెళ్లి చేసుకోవాలని తెలిపారు. అదే విషయాన్ని ఆయన నాకు ఫోన్‌ చేసి చెప్పారు. ఆ తర్వాత మా ఇంట్లో వాళ్లతో పెళ్లి గురించి మాట్లాడారు. అప్పుడే పెళ్లి చేయాలని మా నాన్న అనుకోలేదు. కానీ, మా ఇష్టాన్ని గౌరవించి జూన్‌ 1973లో పెళ్లి జరిపారు’’ అని జయా బచ్చన్‌ తెలిపారు.

మా నాన్నకు మేము పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. తర్వాత ఎలాగోలా మా పెళ్లి జరిగిపోయింది అని జయ తెలిపింది. తన మనవరాలు నవ్య నంద నిర్వహించే ‘వాట్‌ ద హెల్‌ నవ్య’ అనే పాడ్‌కాస్ట్‌ లో ఈ సంగతులను చెప్పుకొచ్చింది. అయితే దశాబ్దం క్రితం ఓ ఇంటర్వ్యూలో అమితాబ్‌(Amitabh Bachchan) మాట్లాడుతూ… పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలన్నది జయ నిర్ణయమేనని తెలిపాడు. సినిమాకు బదులు కుటుంబానికి ప్రాధాన్యతనిచ్చినందుకు సంతోషంగా ఉందన్నాడు.కాగా పెళ్లి తర్వాత బిగ్‌ బీ ఎవరూ ఊహించనంత గొప్ప స్టార్‌ అయ్యాడు. జయ తన కుటుంబానికే సమయం కేటాయించి గృహిణిగా మిగిలిపోయింది. కుమారుడు అభిషేక్‌, కూతురు శ్వేతకు కావాల్సినవి సమకూరుస్తూ అమ్మ బాధ్యతను నిర్వహించింది.

Also Read : Kiran Rao: ఆ సినిమా దారుణంగా ఫ్లాప్‌ కావడానికి బాధ్యత నాదేనంటున్న అమీర్ ఖాన్ మాజీ భార్య !

Abhishek BachchanAmitabh BachchanJaya Bachchan
Comments (0)
Add Comment