Amitabh Bachchan: ‘కల్కి 2898 ఎ.డి’ నుండి అమితాబ్‌ బచ్చన్‌ కొత్త లుక్‌ విడుదల !

‘కల్కి 2898 ఎ.డి’ నుండి అమితాబ్‌ బచ్చన్‌ కొత్త లుక్‌ విడుదల !

Amitabh Bachchan: వైజయంతి మూవీస్ పతాకంపై ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న అతి భారీ బడ్జెట్ సినిమా ‘కల్కి 2898 AD’. ప్రముఖ నిర్మాత అశ్విన్ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ లార్జ్ దెన్ లైఫ్, మైథాలజీ ఇన్స్పైర్డ్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూన్‌ 27న సినిమాని విడుదలకు సిద్ధమౌతున్న ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) అశ్వత్ధామ పాత్రలో కనిపిస్తున్నారు. ఇప్పటికే ఆ పాత్రకు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు పాన్ ఇండియా రేంజ్ లో మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ నటించిన భైరవ పాత్రతో పాటు అతను బుజ్జి (వాహనం) ను పరిచయం చేస్తూ విడుదల చేసిన పోస్టర్లకు విశేష స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో అమితాబ్ బచ్చన్ పోషిస్తున్న అశ్వత్ధామ పాత్రకు సంబంధించి మరో పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.

Amitabh Bachchan …

యావత్ ప్రపంచం ఆశక్తిగా ఎదురుచూస్తున్న ‘కల్కి 2898 ఎ.డి’ సినిమా విడుదలకు మరికొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్లను పరుగులు పెట్టిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఈ సినిమా నుంచి అశ్వత్థామగా అమితాబ్‌ బచ్చన్‌ కొత్త లుక్‌ విడుదల చేశారు. అందులో ఆయన నుదుటిపై ఓ దివ్య రత్నాన్ని ధరించి… చేతిలో ఓ అస్త్రం పట్టుకుని యుద్ధ భూమిలో నిల్చొని కనిపించారు. ఆయన చుట్టూ కొందరు వ్యక్తులు నేలపై పడి ఉండగా… తన వెనుక ఓ చిత్రమైన భారీ వాహనం ఆగి ఉండటం ఆసక్తికరంగా ఉంది. వినూత్నమైన సైన్స్‌ ఫిక్షన్‌ కథతో ముస్తాబైన ఈ చిత్రం ఈ నెల 27న థియేటర్లలోకి రానుండగా.. ఈ నెల 10న ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. ఈ సినిమాకు సంతోష్‌ నారాయణన్‌ సంగీతమందించారు.

Also Read : Adipurush: ‘ఆదిపురుష్‌’లో రావణుడి పాత్రపై ‘రామాయణ్‌’ సీత సంచలన వ్యాఖ్యలు !

Amitabh BachchanKalki 2898 ADNag AshwinPrabhas
Comments (0)
Add Comment