Amitabh Bachchan: కుమార్తెకు ఖరీదైన బంగ్లా గిఫ్ట్ ఇచ్చిన బిగ్ బి !

కుమార్తెకు ఖరీదైన బంగ్లా గిఫ్ట్ ఇచ్చిన బిగ్ బి !

Amitabh Bachchan : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు అమితాబ్‌ బచ్చన్. ఎన్నో సినిమాల్లో తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది ప్రజల మనసులను గెలుచుకున్నారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. బాలీవుడ్ లో స్టార్ హీరోగా గత ఐదు దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలుగుతున్నాడు. బాలీవుడ్ మెగాస్టార్, బిగ్ బిగా గుర్తింపు పొందిన అమితామ్ బచ్చన్… ఒకవైపు సినిమాలు మరోవైపు రియాల్టీ షోలతో ప్రేక్షకులను అలరిస్తూ నటనకు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్నారు.

అయితే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న అమితాబ్(Amitabh Bachchan).. ఫ్యామిలీకి మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. కుమారుడు అభిషేక్ బచ్చన్, కూతురు శ్వేత బచ్చన్ నందా అంటే బిగ్ బీకి అమితమైన ప్రేమ. షూటింగ్స్ నుంచి కాస్తా బ్రేక్ దొరికితే చాలు… అమితాబ్ కుటుంబంతో గడిపేందుకు ఇష్టపడతాడు. ఇప్పటికీ పిల్లల బాగోగులను తనే స్వయంగా చూసుకుంటారు. ఇంట్లో జరిగే ప్రతి వేడుకను తన కూతురు, కుమారుడుతో కలిసి జరుపుకుంటారు. ఈ నేపథ్యంలోనే అమితాబ్ తన కూమార్తె శ్వేతకు కోట్లు విలువ చేసే విలాసవంతమైన భవనాన్ని బహుమతిగా ఇచ్చారని తెలుస్తోంది. ముంబయిలోని జూహులో ఉన్న ప్రతీక్షా బంగ్లాను శ్వేతకు రాసారని… ఈ నెల 8న గిఫ్ట్ డీడ్ కూడా పూర్తియిపోయిందని, అందుకోసం స్టాంప్ డ్యూటీగా రూ. 50.65 లక్షలు చెల్లించినట్టు ముంబయికు చెందిన ‘మనీ కంట్రోల్’ రాసుకొచ్చింది.

Amitabh Bachchan – మూడు బంగ్లాలు ఉన్నా అమితామ్ కు ప్రత్యేకం ప్రతీక్షా బంగ్లా

ముంబైలోని అత్యంత ఖరీదైన జుహు ప్రాంతంలో గల బంగ్లా పేరు ప్రతీక్ష. తన తల్లిదండ్రులు తేజీ, హరివంశ్‌రాయ్ బచ్చన్‌తో కలిసి అమితాబ్(Amitabh Bachchan) తొలుత ఇక్కడే ఉండేవారు. అంతేకాకుండా ఐశ్వర్యల పెళ్లి కూడా అక్కడే జరిగింది. అమితామ్ తండ్రి ఆ బంగ్లాకు ప్రతీక్షా అని పేరు పెట్టడమే కాకుండా… ఆయన రచనల్లోనూ ఆ ఇంటిపేరును ప్రస్తావించిన సందర్భాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రతీక్షా బంగ్లా అంటే అమితాబ్ కు చాలా ఇష్టం.

81 ఏళ్ల అమితాబ్ ఇటీవల ముంబై అంధేరిలో ఉన్న ఓ కమర్షియల్ కాంప్లెక్స్‌లోని 21వ అంతస్తులో ఒక్కో ఫ్లాట్ 7.18 కోట్ల రూపాయల చొప్పున నాలుగు ఫ్లాట్లు కొనుగోలు చేశారు. అలాగే, కొన్నేళ్ల క్రితం ముంబైలోని అట్లాంటిస్‌లో 31 కోట్ల రూపాయలతో విశాలమైన ఫ్లాట్ ను కొన్నారు. ఇక ఇవన్నీ కాకుండా, ప్రస్తుతం అమితాబ్ నివశిస్తున్న ‘జల్సా’ అనే విలాస వంతమైన ఇండిపెండెంట్ హౌస్ వందలాది కోట్ల విలువ చేస్తుంది.

81 ఏళ్ళ వయసులో కూడా సినిమాలతో బిజీగా ఉన్న బిగ్ బి

81 ఏళ్ళ వయసులో కూడా వరుస సినిమాలతో అమితాబ్ బిజీగా ఉన్నారు. చివరిసారిగా టైగర్ ష్రాఫ్ సినిమా ‘గణపతి’లో కనిపించిన బిగ్ బి ప్రస్తుతం పాప్యులర్ టీవీ షో ‘కౌన్ బనేగా కరోడ్ పతి 15’కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. అలాగే ప్రభాస్ సినిమా ‘కల్కి 2898’, సూపర్ స్టార్ రజనీకాంత్‌ 170వ సినిమా ‘తలైవర్ 170’లోనూ అమితాబ్ నటిస్తున్నారు.

Also Read : Trisha-Mansoor: దెబ్బకు దిగొచ్చిన మన్సూర్ ఆలీఖాన్…

Amitabh Bachchan
Comments (0)
Add Comment