Popular Actor Amitabh Bachchan :కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి షోకు బిగ్ బి హోస్ట్

ధ్రువీక‌రించిన న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్

Amitabh Bachchan : ముంబై – భార‌త దేశంలో అత్య‌ధిక జ‌నాద‌ర‌ణ పొందిన ప్రాయోజిత కార్య‌క్ర‌మం కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి షో. ప్ర‌స్తుతం ఈ షోను ప్ర‌పంచ వ్యాప్తంగా ఆద‌రిస్తున్నారు. అత్య‌ధిక రేటింగ్ కూడా వ‌చ్చింది ఈ కార్య‌క్ర‌మానికి. దీనిని ప్ర‌ముఖ బాలీవుడ్ న‌టుడు అమితాబ్ బ‌చ్చ‌న్(Amitabh Bachchan) నిర్వ‌హిస్తూ వ‌స్తున్నారు. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు కౌన్ బ‌నేగా క‌రోడ్ ప‌తి 16 సీజ‌న్స్ పూర్త‌య్యాయి. ప్ర‌స్తుతం 17వ షో ప్ర‌సారం కావాల్సి ఉంది. ఇదిలా ఉండ‌గా ఈ షోకు అమితాబ్ బ‌చ్చ‌న్ ఉంటాడా లేదా అన్న అనుమానాలు వ్య‌క్తం అయ్యాయి. దీనిపై స్పందించారు న‌టుడు బిగ్ బి.

Amitabh Bachchan KBC 17th Show

తాను త‌ప్పుకుంటున్న‌ట్లు వ‌స్తున్నదంతా అబ‌ద్ద‌మ‌ని స్ప‌ష్టం చేశారు. ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇందుకు సంబంధించి స్టార్ టీవీ యాజ‌మాన్యం సైతం ధ్రువీక‌రించింది. త్వ‌ర‌లోనే ఈ షో టెలికాస్ట్ అవుతుంద‌ని స్ప‌ష్టం చేసింది. ఇదిలా ఉండ‌గా త‌న సినీ కెరీర్ లో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్న స‌మ‌యంలో కేబీసీ సేవ్ చేసింది అమితాబ్ బ‌చ్చ‌న్ ను. కాగా షో మేక‌ర్స్ ఒక భావోద్వేగ పూరిత‌మైన వీడియోను విడుద‌ల చేశారు. ఈ వీడియోలో తాను మిమ్మ‌ల్ని త‌దుప‌రి సీజ‌న్ ల‌లో తిరిగి క‌లిసేందుకు సిద్దంగా ఉన్నాన‌ని చెప్పాడు అమితాబ్ బ‌చ్చ‌న్.

బిగ్ బి వ‌య‌సు ప్ర‌స్తుతం 82 ఏళ్లు. ప్రతి దశ ప్రారంభంలో, ఎల్లప్పుడూ ఆలోచన ఉంటుంది – చాలా సంవత్సరాల తర్వాత, నేను ఇప్పటికీ అందరి కళ్ళలో అదే ప్రేమ ను చూశాన‌ని అన్నారు అమితాబ్ బ‌చ్చ‌న్. ఈ సంద‌ర్బంగా త‌న షో కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నార‌ని వారిని త‌ప్ప‌కుండా షో ద్వారా తిరిగి క‌లుసుకునే ప్ర‌య‌త్నం చేస్తాన‌ని అన్నారు.

Also Read : Hero Nagarjuna-Puri Jagannath :మ‌న్మ‌థుడితో పూరీ జ‌గ‌న్నాథ్ మూవీ..?

Amitabh BachchanUpdatesViral
Comments (0)
Add Comment