Amitabh Bachchan: ‘కల్కి’ సినిమా, బుజ్జి వాహనం పై బిగ్ బి అమితాబ్‌ ప్రశంసల జల్లు !

‘కల్కి’ సినిమా, బుజ్జి వాహనం పై బిగ్ బి అమితాబ్‌ ప్రశంసల జల్లు !

‘కల్కి’ సినిమా, బుజ్జి వాహనం పై బిగ్ బి అమితాబ్‌ ప్రశంసల జల్లు !

 

వైజయంతి మూవీస్ పతాకంపై ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో నిర్మిస్తున్న అతి భారీ బడ్జెట్ సినిమా ‘కల్కి 2898 AD’. ప్రముఖ నిర్మాత అశ్విన్ దత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ లార్జ్ దెన్ లైఫ్, మైథాలజీ ఇన్స్పైర్డ్ ఫ్యుచరిస్ట్ సైన్స్ ఫిక్షన్ గ్లోబల్ ఫిల్మ్ లో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటాని ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. జూన్‌ 27న సినిమాని విడుదలకు సిద్ధమౌతున్న ఈ సినిమాకు సంబంధించి భైరవ పాత్రలో హీరో ప్రభాస్ ఉపయోగించిన బుజ్జి (వాహనం) ను పరిచయం చేస్తూ ఇటీవలే రామోజీ ఫిల్మ్‌సిటీలో ఓ వేడుకని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హీరో ప్రభాస్… సినిమాలో బుజ్జి పాత్రకు సంబంధించిన ప్రత్యేక వాహనాన్ని నడుపుకుంటూ వేదిక మధ్యలోకి వచ్చి అభిమానుల్ని అలరించారు. ప్రస్తుతం ప్రభాస్ ఎంట్రీతో పాటు బుజ్జి వాహనం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. గత రెండు రోజులుగా ఎక్కడ విన్నా ఈ సినిమాలోని బుజ్జి గురించే వినపడుతోంది.

అయితే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ లో అశ్వత్థామ పాత్రలో పోషిస్తున్న బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు అమితాబ్‌ బచ్చన్‌ తాజాగా ఈ సినిమాపై ఆయన ఆసక్తికర కామెంట్స్‌ చేశారు. ‘ఇలాంటి ప్రాజెక్ట్‌ ల తుది ఫలితం ఎలా ఉంటుందో ప్రారంభానికి ముందు ఎవరూ ఊహించలేరు. రోజులు గడిచేకొద్దీ షూటింగ్‌ చేస్తున్న సమయంలో కొన్ని సన్నివేశాలు దీని విజయం గురించి సంకేతాలిస్తాయి. డైరెక్టర్‌ ఇంత అద్భుతంగా ఎలా ఆలోచించారని అందరూ ఆశ్చర్యపోతారు. ఇలాంటి చిత్రాలకు వచ్చే ప్రశంసలు ఎప్పటికీ ఆగవు. ఇప్పుడు నేను మెచ్చుకున్నట్లే ఎంతోమంది దీన్ని ప్రశంసిస్తారు. ఇందులోని బుజ్జి మరో అద్భుతం. దర్శకుడి ఆలోచనలకు అది ప్రతిరూపం’ అని బిగ్ బి అమితాబ్ అన్నారు. ప్రస్తుతం అమితాబ్ ప్రశంసలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ‘కల్కి 2898 AD’ సినిమాను, దర్శకుడు నాగ్ అశ్విన్ ను అమితాబ్ ప్రశంసించడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ దీని గురించి ఆయన మాట్లాడుతూ… అత్యాధునిక సాంకేతికతతో రూపొందిస్తున్న ఈ సినిమా గొప్ప అనుభవాన్ని పంచిందన్నారు.

 

Amitabh BachchanKalki 2898 ADNag AshwinPrabhas
Comments (0)
Add Comment