Ameesha Patel : బాలీవుడ్ బ్యూటీ అమీషా పటేల్ , స్టార్ హీరో హృతిక్ రోషన్ సంచలనంగా మారారు. ఈ ఇద్దరూ కలిసి సూపర్ డూపర్ హిట్ మూవీ కహోనా ప్యార్ హై లో నటించారు. ఇది బాలీవుడ్ ను షేక్ చేసింది. భారీ వసూళ్లను రాబట్టింది. సినీ ట్రేడ్ వర్గాలను విస్తు పోయేలా చేసింది. కోట్లు కురిపించింది. రాకేశ్ రోషన్ దర్శకత్వం, నిర్మించిన కహోనా ప్యార్ హై చిత్రం గతంలో ఏ చిత్రం సాధించనన్ని రికార్డులను స్వంతం చేసుకుంది.
Ameesha Patel-Hrithik Roshan Viral
ఈ మూవీ బిగ్ సక్సెస్ కావడంతో అమీషా పటేల్(Ameesha Patel), హృతిక్ రోషన్ దుబాయ్ లో కలుసు కోవడంతో ఒక్కసారిగా మరోసారి సినిమా సీక్వెల్ వస్తుందా అని ఆరా తీశారు నెటిజన్లు, ఫ్యాన్స్. కహో నా ప్యార్ హై జంట మరింత ఆసక్తిని రేపుతోంది.
వారి పునః కలయికకు సంబంధించిన ఫోటోలు , వీడియోలు వైరల్ అయ్యాయి. ఇందుకు సంబంధించిన ఫోటోలను స్వయంగా అమీషా పటేల్ షేర్ చేసింది. మూవీకి సంబంధించిన ఫోటోను కూడా ఇందుకు జత చేయడంతో మరోసారి తిరిగి నటిస్తున్నారని అనుకుంటున్నారు.
యాక్షన్, థ్రిల్లర్ , రొమాంటిక్ సన్నివేశాలతో కహో నా ప్యార్ హై చిత్రాన్ని తీశారు హృతిక్ రోషన్. మరోసారి ఈ ఇద్దరు కలిసి నటించాలని కోరుకుందాం.
Also Read : Hero Dhanush-Kriti Movie : కృతి సనన్ ధనుష్ మూవీ షూటింగ్ షురూ