Game Changer: భారీ ధరకు రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ ఓటీటీ రైట్స్ !

భారీ ధరకు రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' ఓటీటీ రైట్స్ !

Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్… స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న తాజా సినిమా ‘గేమ్ ఛేంజర్’. రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ కియరా అద్వానీ నటిస్తున్న ఈ సినిమాలో ఎస్‍జే సూర్య, అంజలి, జయరాం, సునీల్, శ్రీకాంత్, సముద్రఖని కీలకపాత్రలు పోషిస్తున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అంతర్లీనంగా ఓ సోషల్ మెసేజ్ తో సినిమాను తెరకెక్కించడంతో సిద్ధహస్తుడు దర్శకుడు శంకర్. ఈ నేపథ్యంలో శంకర్, రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన ఫస్ట్ లుక్, టైటిల్ లుక్, ఫస్ట్ సాంగ్ టీజర్ కు విశేషమైన స్పందన వచ్చింది. ఆర్ఆర్ఆర్ వంటి భారీ విజయం అందుకున్న తరువాత రామ్ చరణ్ నటిస్తున్న సినిమా కావడంతో… గేమ్ ఛేంజర్ పై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

Game Changer OTT Updates

మోస్ట్ ఎవెయిటెడ్ పాన్ ఇండియా ప్రాజెక్టులో ఒకటిగా ఉన్న ‘గేమ్ ఛేంజర్(Game Changer)’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం విశాఖపట్నంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఇదే విషయాన్ని తాజాగా ముంబైలో నిర్వహించిన ప్రైమ్ వీడియో ఈవెంట్‌ లో ఆ సంస్ధ నిర్వాహకులు వెల్లడించారు. థియేటర్లలో రిలీజ్ డేట్ ఫిక్స్ చేయకముందే ఈ సినిమాకు సంబంధించిన స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకున్నట్టు ఆ ప్లా ట్‍ఫామ్ ప్రకటించింది. భారీ బడ్జెట్‍ తో తెరకెక్కుతున్న ఈ మూవీ స్ట్రీమింగ్ హక్కుల కోసం అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తాన్ని వెచ్చించినట్లు టాక్ వినిపిస్తోంది. ఫ్యాన్సీ రేట్ కు గేమ్ ఛేంజర్ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో కొన్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా… ఈ నెల 27న రామ్‍ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా గేమ్ ఛేంజర్ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.

Also Read : Surya Kanguva: విజువల్ ట్రీట్ ఇస్తున్న సూర్య ‘కంగువ’ టీజర్‌ !

game changerram charansankar
Comments (0)
Add Comment