Amaran OTT : థియేటర్లలో ఉండగానే ఓటీటీకి సిద్ధమవుతున్న ‘అమరన్’

సోనీపిక్చర్స్‌తో కలిసి నటుడు కమల్‌హాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మించింది...

Amaran : ఈ దీపావళికి బాక్సాఫీస్ దగ్గర మంచి సందడి చేశాయి. విడుదలైన సినిమాలన్నీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఈ దీపావళికి దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లక్కీ భాస్కర్ సినిమా, కిరణ్ సబ్బవరం క, అలాగే శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన అమరన్(Amaran) సినిమా విడుదలయ్యాయి. కాగా అమరన్ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా ‘అమరన్’ రూ.200 కోట్ల మార్కును క్రాస్ చేసినట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమా తమిళ్ తెలుగు భాషల్లో విడుదలై రెండు చోట్ల భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు మంచి కలెక్షన్స్ సాధించింది. రాజ్‌కుమార్ పెరియసామి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.

Amaran Movie OTT Updates

సోనీపిక్చర్స్‌తో కలిసి నటుడు కమల్‌హాసన్‌కు చెందిన రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రంలో శివకార్తికేయన్ ఆర్మీ సైనికుడిగా నటించారు. ఆయనకు జోడీగా నటి సాయి పల్లవి అద్భుతంగా నటించింది. ఈ చిత్రానికి సంగీతదర్శకుడు జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. దివంగత ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. శివకార్తికేయన్ మరోసారి తన నటనతో ఆకట్టుకోగా.. సాయి పల్లవి మేజర్ ముకుంద్ సతీమణి ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో ఒదిగిపోయింది. ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అలరించడానికి రెడీ అవుతుంది.

అమరన్(Amaran) ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. అమరన్ డిజిటల్ హక్కులను 60 కోట్ల రూపాయలకు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తోంది. నవంబర్ చివరిలో ఈ సినిమాను ఓటీటీలో అందుబాటులోకి తీసుకురానున్నారని టాక్. త్వరలోనే ఈమేరకు అనౌన్స్ మెంట్ ఇవ్వనున్నారు మేకర్స్. కాగా మేజర్ ముకుంద్ వరదరాజన్ 31 సంవత్సరాల వయస్సులో భారతదేశాన్ని శత్రువుల నుండి రక్షించడానికి చేసిన త్యాగానికి దేశ అత్యున్నత పురస్కారం అశోక్ చక్రను ప్రదానం చేశారు. దివంగత ముకుంద్ భార్య ఇందు ముకుంద్ 2015 రిపబ్లిక్ డే కార్యక్రమంలో ఈ అవార్డును అందుకున్నారు.

Also Read : Ram Gopal Varma : మద్దిపాడు పిఎస్ లో డైరెక్టర్ ‘రామ్ గోపాల్ వర్మ’ పై కేసు నమోదు

AmaranCinemaNational. TrendingOTTUpdatesViral
Comments (0)
Add Comment