Amala Paul: కొడుకు ఫేస్ రివీల్ చేసిన హీరోయిన్ అమలాపాల్ !

కొడుకు ఫేస్ రివీల్ చేసిన హీరోయిన్ అమలాపాల్ !

Amala Paul: టాలీవుడ్ హీరోయిన్లలో పరిచయం అక్కర్లేని పేరు అమలాపాల్. నాయక్ మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన భామ స్టార్‌ హీరోల సరసన మెప్పించింది. ఇటీవలే రిలీజైన పృథ్వీరాజ్ సుకుమారన్ మూవీ ఆడుజీవితం(గోట్ లైఫ్) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే గతేడాది ప్రియుడు జగత్‌ దేశాయ్‌ ను రెండో పెళ్లి చేసుకున్న అమలాపాల్… ఇటీవలే ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. 2023లో పెళ్లి జరగ్గా… ఈ జూన్‌లో కొడుకు పుట్టాడు. తాజాగా ఓనం పండగ సందర్భంగా కొడుకు ముఖాన్ని రివీల్ చేసింది. అలానే క్యూట్ ఫొటోలకు పోజులిచ్చింది.

Amala Paul Reveals..

తమిళ సినిమాలతో హీరోయిన్‌ గా పరిచయమైన అమలాపాల్(Amala Paul)… తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ వీళ్ల బంధం నిలబడలేదు. మూడేళ్లకే విడిపోయారు. అలా 2017 నుంచి ఒంటరిగానే ఉంది. గతేడాది మాత్రం జగత్ దేశాయ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీళ్లకు జూన్‌ లో కొడుకు పుట్టాడు. అతడికి ఇళయ్ అని పేరు పెట్టింది. ఓనం సందర్భంగా కొడుకు ఫేస్ రివీల్ చేసింది అమలాపాల్. నదిలో పడవలో కొడుకు-భర్తతో కలిసి క్యూట్ పోజులిచ్చింది. అలానే భర్తని ముద్దాడింది. ఈ ఫొటోలన్నింటినీ ఇన్ స్టాలో షేర్ చేసింది. ఈ ఫ్యామిలీని చూస్తుంటేనే చూడముచ్చటగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Allu Arjun: గుర్తు తెలియని వ్యక్తి నుంచి సర్ప్రైజ్ గిఫ్ట్‌ అందుకున్న అల్లు అర్జున్ !

Amala PaulThe Goat Life
Comments (0)
Add Comment