Amala Paul : తన డ్రెస్సింగ్ పై వస్తున్న విమర్శలపై స్పందించిన అమలా పాల్

తన డ్రెస్‌పై వస్తున్న విమర్శలపై అమలా పాల్‌ కాస్త సీరియస్గా రియాక్టయ్యారు...

Amala Paul : ప్రస్తుతం ‘లెవల్ క్రాస్’ అనే మలయాళ మూవీ లో నటిస్తోంది అమల. ఆసిఫ్ అలీ హీరోగా నటిస్తున్నాడు. అర్ఫజ్ అయుబ్ దర్శకుడు. ప్రముఖ దర్శకుడు జీతూ జోసెఫ్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈమూవీ జులై 26వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఆసిఫ్ అలీ, అమలా పాల్ ఎర్నాకులం, కొచ్చిలోని సెయింట్ ఆల్బర్ట్ కాలేజీకి వెళ్లారు. అయితే అమల పొట్టి దుస్తులలో నెక్ లైన్‌తో దర్శనమిచ్చింది. దీనిపై సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్స్ వస్తున్నాయి. పొట్టి దుస్తులతో కనిపించి విద్యార్థులకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Amala Paul Comment

తన డ్రెస్‌పై వస్తున్న విమర్శలపై అమలా పాల్‌(Amala Paul) కాస్త సీరియస్గా రియాక్టయ్యారు. ఆ డ్రెస్‌లో తాను కంఫర్ట్ గానే ఉన్నానని అన్నారు. అమలా కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తనకు సౌకర్యవంతంగా ఉన్న దుస్తుల్నే ధరించాను కానీ.. సరైనవా కాదా అని ఎప్పుడూ భావించలేదని చెప్పుకొచ్చారు ఈ ముద్దుగుమ్మ. ఈ ఫంక్షన్‌కి ఈ దుస్తులు సరైనది కాదని తాను ఆలోచించలేదంది. కెమెరాలు తన డ్రెస్సింగ్ స్టైల్‌ను తప్పుగా ప్రొజెక్ట్ చేసినట్లు ఉన్నాయని అన్నారు. తన కాదు.. విద్యార్థులు కూడా అసౌకర్యంగా ఏం లేరని చెప్పారు. అంతేకాదు ఏ దుస్తులు వేసుకోవాలో ఎంచుకునే ఛాయిస్ ప్రతి అమ్మాయికి ఉంటుందని.. అలా దుస్తులు వేసుకోవడంతోనే ఆత్మస్థైర్యం వస్తుందని.. ఇదే విషయం విద్యార్థులకు తన ద్వారా తెలిసిందని అనుకుంటున్నానని చెప్పారు.

Also Read : Telugu Film Chamber : తెలుగు ఫార్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవికి ‘భరత్ భూషణ్’

Amala PaulBreakingCommentsViral
Comments (0)
Add Comment