Amala Paul: కొత్త సంవత్సరం ప్రారంభంలోనే అభిమానులకు అమలాపాల్ శుభవార్త చెప్పింది. గత ఏడాది నవంబరులో రెండో పెళ్లి చేసుకున్న అమలాపాల్… ఇటీవల గర్భం దాల్చినట్లు తెలిపింది. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా వేదికగా ‘ఇద్దరం ముగ్గురు కాబోతున్నాం’ అంటూ అధికారికంగా ప్రకటించింది. అంతేకాదు తన భర్త జగత్ దేశారు గుండెలో ఉన్నట్టుగా ఒక ఫొటో, తాను బేబీ బంప్‌ని పట్టుకున్న ఫొటోను అమల్‌పాల్ పోస్టు చేసింది. ఈ ఫొటోలకు నీతో (భర్త జగత్ దేశారు) 1+1 = 3 అవుతుందని నాకు ఇప్పుడే తెలిసింది’ అని క్యాప్షన్ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనితో అభిమానులు అమలాపాల్ కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
‘నాన్న’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్… అదే సినిమాలో నటించిన హీరోయిన్ అమలాపాల్‌ని 2014లో పెళ్లి చేసుకున్నాడు. అయితే అమలాపాల్(Amala Paul) తో ఏర్పడిన విభేధాల కారణంగా 2017లో విజయ్ విడిపోయాడు. ఆ తరువాత 2019లో ఐశ్వర్య అనే అమ్మాయిని విజయ్ పెళ్ళి చేసుకోగా… అమలాపాల్ మాత్రం కొంతకాలంగా జగత్ దేశారు అనే ఈవెంట్ మేనేజర్ తో డేటింగ్ లో ఉండేది.
Amala Paul Viral
అయితే గత ఏడాది నవంబర్ 5న కొచ్చిలో జగత్ దేశారుని వివాహం చేసుకున్న అమలాపాల్… కేవలం రెండు నెలలకే తాను గర్భవతి అంటూ గుడ్ న్యూస్ చెప్పింది. ‘బెజవాడ’ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన అమలాపాల్… రామ్‌చరణ్ సరసన ‘నాయక్’, తదుపరి అల్లు అర్జున్ తో ‘ఇద్దరమ్మాయిలతో’ చిత్రాల్లో నటించి విజయాన్ని అందుకున్నారు. సౌత్ సినిమాలతోపాటు బాలీవుడ్ చిత్రాల్లోనూ అవకాశం అందుకుంది. ప్రస్తుతం బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ జంటగా ఆడుజీవితంలో అమలాపాల్ నటిస్తోంది.
Also Read : Premgi Amaren: 2024లో పెళ్లి పక్కా అంటున్న సీనియర్ నటుడు !