Amala Paul: భర్తపై అమలాపాల్ భావోద్వేగంతో కూడిన పోస్ట్ !

భర్తపై అమలాపాల్ భావోద్వేగంతో కూడిన పోస్ట్ !

Amala Paul: టాలీవుడ్ హీరోయిన్లలో పరిచయం అక్కర్లేని పేరు అమలాపాల్. నాయక్ మూవీతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చిన భామ స్టార్‌ హీరోల సరసన మెప్పించింది. ఇటీవలే రిలీజైన పృథ్వీరాజ్ సుకుమారన్ మూవీ ఆడుజీవితం(గోట్ లైఫ్) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే గతేడాది ప్రియుడు జగత్‌ దేశాయ్‌ ను పెళ్లి చేసుకున్న అమలాపాల్… ఆ తర్వాత అభిమానులకు గుడ్‌ న్యూస్‌ కూడా చెప్పింది. ప్రెగ్నెన్సీతో ఉన్నట్లు ప్రకటించి ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. త్వరలోనే బిడ్డకు జన్మనివ్వబోతున్న ముద్దుగుమ్మ తాజాగా చేసిన పోస్ట్‌ నెట్టింట వైరలవుతోంది. ఈ సందర్భంగా తన భర్త జగత్‌ దేశాయ్‌పై ప్రశంసలు కురిపించింది. ప్రెగ్నెన్సీ ధరించిన సమయం నుంచి తనకు అన్ని విధాలుగా అండగా నిలిచారని కొనియాడారు.

Amala Paul Post Viral

అమలాపాల్(Amala Paul) తన ఇన్‌స్టాలో రాస్తూ… ‘ నాతో పాటు అర్థరాత్రి వరకు ఉంటూ… నా ఇబ్బందులను ఒక్కొక్కటిగా తగ్గిస్తూ… నాపై మీకున్న అచంచలమైన నమ్మకం… మీ ఉత్తేజపరిచే మాటలు నాలో శక్తిని నింపాయి. ఈ విలువైన గర్భధారణ ప్రయాణంలో నా వెన్నంటే ఉన్నందుకు ధన్యవాదాలు. నా ఆత్మవిశ్వాసం సన్నగిల్లిన క్షణాల్లో కూడా నాకు మద్దతుగా నిలిచారు. మీలాంటి అపురూపమైన వ్యక్తి నా జీవితంలోకి రావడం… నిజంగా నేను ఏదో అద్భుతమైనా చేసి ఉండాలి. నా శక్తి, ప్రేమ తిరుగులేని మద్దతు ఉన్నందుకు ధన్యవాదాలు. నేను చెప్పే మాటలకంటే ఎక్కువగా నేను నిన్ను ప్రేమిస్తున్నా’ అంటూ పోస్ట్‌ చేసింది. ఇది చూసిన అభిమానులు బ్యూటీఫుల్ కపుల్ అంటూ పోస్టులు పెడుతున్నారు.

Also Read : Devara Movie : ఎన్టీఆర్ దేవర షూటింగ్ లో అనుకోని సంఘటన

Amala PaulNayakThe Goat Life
Comments (0)
Add Comment