Hero Charan-Allu Arvind :చెర్రీ నాకు మేన‌ల్లుడు..బిడ్డ లాంటోడు

ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్

Allu Arvind : ప్ర‌ముఖ సినీ నిర్మాత అల్లు అర‌వింద్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మెగా ఫ్యామిలీకి సంబంధించి తాను చేసిన కామెంట్స్ కొంద‌రిని బాధ పెట్ట‌డం ప‌ట్ల స్పందించారు. ఈ సంద‌ర్బంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రామ్ చ‌ర‌ణ్ గురించి తాను అలా మాట్లాడాల్సి ఉండేది కాద‌న్నారు. చెర్రీ త‌న‌కు బిడ్డ లాంటోడ‌ని అన్నారు అల్లు అర‌వింద్(Allu Arvind).

Allu Arvind Comment

వాడు నాకు ఏకైక మేన‌ల్లుడంటూ పేర్కొన్నారు. ఇదే స‌మ‌యంలో ప్ర‌ముఖ నిర్మాత‌, తెలంగాణ డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ దిల్ రాజు గురించి కూడా తాను త‌ప్పుగా మాట్లాడాన‌ని, దీనికి తాను చింతిస్తున్నాన‌ని చెప్పారు. మాట్లాడుతున్న‌ప్పుడు ఫ్లోలో అనుకోకుండా పొర‌పాటు జ‌రిగింద‌ని అన్నారు. దీనికి త‌న‌ను మ‌న్నించాల‌ని ఆయ‌న దిల్ రాజును కోరారు.

కాగా మెగా ఫ్యాన్స్ కావాల‌ని త‌న‌ను ట్రోల్ చేయ‌డం మొద‌లు పెట్టార‌ని, వారంద‌రికీ చెప్పేది ఏమిటంటే చిరంజీవి కుటుంబంలో తాము కూడా ఒక భాగ‌మ‌ని గుర్తు పెట్టుకోవాల‌న్నారు. అభిమానులు ఎవ‌రూ కూడా బాధ ప‌డ‌వ‌ద్ద‌ని కోరారు. ఇదిలా ఉండ‌గా అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన విక్ట‌రీ వెంక‌టేశ్, ఐశ్వ‌ర్య రాజేష్, మీనాక్షి చౌద‌రి క‌లిసి న‌టించిన సంక్రాంతికి వ‌స్తున్నాం బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఈ సంద‌ర్బంగా అల్లు అర‌వింద్ కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది.

Also Read : Sanam Theri Kasam Sensational :స‌న‌మ్ తేరి క‌స‌మ్ రీ రిలీజ్ వ‌సూళ్ల‌లో రికార్డ్

Allu AravindCommentsGlobal Star Ram CharanViral
Comments (0)
Add Comment