Chiranjeevi : జైలు నుండి మధ్యంతర బెయిల్‌తో విడుదలైన అల్లు అర్జున్‌కు సంఘీభావం తెలిపేందుకు సినీ ప్రముఖులు ఆయన ఇంటికి క్యూ కట్టిన విషయం తెలిసిందే. అయితే ఆయన రిలీజ్ విషయంలో సింహభాగం పోషించిన చిరంజీవి(Chiranjeevi)ని ఆయన కలిసేందుకు ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ ఈరోజు(ఆదివారం) మధ్యాహ్నం12:00 గంటలకి చిరు ఇంటికి చేరుకొని కలవనున్నట్లు సమాచారం. అక్కడ చిరు ఫ్యామిలీతో కలిసి లంచ్ చేస్తారు. బన్నీ అరెస్ట్ తర్వాత మొదటగా అల్లు ఫ్యామిలీని కలిశారు చిరంజీవి. విశ్వంభర సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ఆయన షూట్ క్యాన్సిల్ చేసుకొని హుటాహుటిన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి బయలుదేరిన విషయం తెలిసిందే. భద్రత పరిణామాల దృష్ట్యా చిరుని పోలీస్ స్టేషన్ కి అనుమతించ లేదు. దీంతో ఆయన బన్నీ ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడి నుండి న్యాయవాదులను సంప్రదించి రిలీజ్ లో చిరు కీలక పాత్ర పోషించినట్లు సమాచారం.
Allu Arjun Meet Chiranjeevi
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు గురించి తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. మరికాసేపట్లో ఆయన హైదరాబాద్‌కు చేరుకుని అల్లు అర్జున్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. సంధ్యా థియేటర్ ఘటన, అరెస్టు గురించి బన్నీ టీమ్‌ని అడిగి వివరాలు తెలుసుకోనున్నారు పవన్. పవన్ తో దర్శకుడు త్రివిక్రమ్ కూడా రానున్నారు.
Also Read : Hero Suriya : ఆ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో సినిమా చేయనున్న హీరో సూర్య