Allu Arjun : పుష్ప సీక్వెల్ 3 కూడా కొనసాగించాలనుకుంటున్నాము – బన్నీ

అల్లు అర్జున్ మాట్లాడుతూ ``పుష్ప సినిమాను ఓవర్సీస్ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారో చూడాలని ఇక్కడికి వచ్చాను'' అని అన్నారు

Allu Arjun : అల్లు అర్జున్ కెరీర్‌లో పుష్ప ది రైజ్ బిగ్గెస్ట్ సక్సెస్. దీనికి సీక్వెల్ గా రూపొందిన “పుష్ప ది రూల్` ఆగ‌స్ట్ 15న విడుద‌ల కానుంది. మూడో భాగం ఉంటుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ దీనిపై క్లారిటీ ఇచ్చాడు. 74వ బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొనేందుకు ఆయన జర్మనీ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ ఫెస్టివల్‌లో ‘పుష్ప ది రైజ్‌’ చిత్రాన్ని ప్రదర్శించినట్లు తెలుస్తోంది. నిజానికి ఇది తెలుగు సినిమాకు దక్కిన గౌరవంగా అందరూ భావిస్తున్నారు.

Allu Arjun Comment Viral

ఈ వేడుకకు హాజరైన అల్లు అర్జున్(Allu Arjun) స్థానిక మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన పుష్ప సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “మేము పుష్ప కథను కొనసాగించాలనుకుంటున్నాము.” ‘పుష్ప’ పార్ట్ 3 తప్పకుండా వస్తుందని.. దీన్ని తెరపైకి తీసుకురావాలనే గొప్ప ఆలోచన ఉంది’’ అని ప్రకటించారు. ‘పుష్ప’ సిరీస్‌ను కొనసాగించాలనుకుంటున్నట్లు బన్నీ తెలిపాడు.

అల్లు అర్జున్ మాట్లాడుతూ “పుష్ప సినిమాను ఓవర్సీస్ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారో చూడాలని ఇక్కడికి వచ్చాను” అని అన్నారు. పుష్ప (పుష్ప2) రెండవ భాగంలో మొదటి భాగం కంటే పాత్రలు మరియు వారి మధ్య సంఘర్షణలు బలంగా ఉన్నాయి. ముఖ్యంగా రోజ్‌వుడ్‌ స్మగ్లర్‌ పుష్పరాజ్, పోలీస్‌ ఆఫీసర్‌ షెకావత్‌ పాత్రలు, వారి మధ్య జరిగే సంఘర్షణ ఉత్కంఠభరితంగా సాగుతుంది’’ అన్నారు.

Also Read : Hero Nithin: మున్నార్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న నితిన్ ‘రాబిన్‌ హుడ్’ !

allu arjunPushpaTrendingUpdatesViral
Comments (0)
Add Comment