Allu Arjun : ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఇటీవలే సింగపూర్ లో చదువుకుంటున్న పవన్, అన్నా లెజనోవా తనయుడు మార్క్ శంకర్ పాఠశాలలో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడ్డాడు. తనను అక్కడికి నుంచి ఇంటికి తీసుకువచ్చారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే బన్నీ తన ఇంటికి వెళ్లారు. యోగక్షేమాలు అడిగారు. పవన్ కళ్యాణ్ ను ఆలింగనం చేసుకున్నారు.
Allu Arjun Meet Pawan Kalyan Family
మార్క్ శంకర్ కు ఎలా ఉందంటూ వాకబు చేశారు. తన కాళ్లు, చేతులకు గాయాలయ్యాయని, ప్రస్తుతం చికిత్స కొనసాగుతోందన్నారు. ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదంటూ వైద్యులు సూచించారని ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ బన్నీకి వివరించారు. బన్నీ(Allu Arjun)తో పాటు భార్య స్నేహా రెడ్డి కూడా ఉన్నారు. వీరు గంటకు పైగా గడిపారు. ఇటీవల మెగా ఫ్యామిలీకి అల్లు అరవింద్ కుటుంబానికి మధ్య గ్యాప్ ఏర్పడిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అదంతా ఒట్టిదేనని తేలి పోయింది ఈ పరామర్శతో.
ఇదిలా ఉండగా తన తనయుడు మార్క్ శంకర్ సురక్షితంగా అగ్ని ప్రమాదం నుంచి బయట పడడంతో పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజనోవా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. స్వామి వారికి తలనీలాలు సమర్పించారు. అనంతరం శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో స్వయంగా భక్తులకు అన్నం వడ్డించారు. రూ. 17 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అయ్యాయి.
Also Read : Anant Mahadevan Shocking :బాహుబలి..పుష్ప మూవీస్ కు అంత సీన్ లేదు