Allu Arjun: పవన్ కళ్యాణ్ పై అల్లు అర్జున్ మామ సంచలన వ్యాఖ్యలు !

పవన్ కళ్యాణ్ పై అల్లు అర్జున్ మామ సంచలన వ్యాఖ్యలు !

Allu Arjun: మెగా ఫ్యామిలీ, అల్లు ఫ్యామిలీ మధ్య విభేదాలు ఉన్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనికి 2024 సాధారణ ఎన్నికల్లో అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు మరింత బలాన్ని చేకూర్చింది. ఎన్నికల్లో పిఠాపురం నుండి పోటీ చేస్తున్న తన సొంత మేనమామ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్(Pawan Kalyan) కు ట్విట్టర్ ద్వారా ఆల్ ది బెస్ట్ చేప్పిన బన్నీ… పోలింగ్ కు 24 గంటలకు ముందు తన స్నేహితుడు, నంధ్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి శిల్పా రవిచంద్రా రెడ్డి ఇంటికి స్వయంగా వెళ్ళి ఆల్ ది బెస్ట్ చెప్పాడు. దీనితో మెగా, అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు ఉన్నట్లు సుష్పష్టం అయింది. అయితే ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అఖండ మెజారిటీతో గెలుపొందడమే కాకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటులో కీలకంగా మారారు. అయితే బన్నీ మద్దత్తు ఇచ్చిన శిల్పా రవిచంద్రా రెడ్డి ఓడిపోవడంతో పాటు వైసీపీ ఘోర పరాజయం పాలయింది.

దీనితో అల్లు ఫ్యామిలీపై కొణిదెల నాగబాబు సహా మెగా ఫ్యామిలీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా పరోక్షంగా సెటైర్లు వేసారు. ఇది ఇలా ఉండగా పిఠాపురం నుండి అఖండ మెజారిటీతో గెలుపొందిన పవన్ కళ్యాణ్… ఏపీ డిప్యూటీ సీఎంగా, అటవీ, పర్యావరణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై కర్ణాటక ప్రభుత్వంతో కలిసి మాట్లాడిన పవన్ కళ్యాణ్… గతంలో హీరోలు అడవులను రక్షిస్తే… ఇటీవల హీరోలు స్మగ్లర్ల వేషాలు వేస్తూ అడవులను నాశనం చేయడానికి ప్రోత్సహిస్తున్నారంటూ వ్యాఖ్యానించారు.

దీనితో ఈ వ్యాఖ్యలు అల్లు అర్జున్(Allu Arjun) ను ఉద్దేశ్యించినవే అంటూ అల్లూ ఫ్యామిలీ అభిమానులు గుస్సా అవుతున్నారు. ఈ వివాదం ఇంకా సద్దు మణగకముందే ఇటీవల ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాకు ఇష్టమైన వారి కోసం ఎక్కడిదాకైనా వస్తా… తగ్గేదే లేదు అన్నారు. అంతేకాదు చిరంజీవి వలనే నేను ఈ స్థాయికి వచ్చామని పలు బహిరంగ వేదికలపై చెప్పిన అల్లు అర్జున్… అభిమానుల వల్లనే నేను హీరో అయ్యాను. మీరు నా ఆర్మీ అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. దీనితో మెగా ఫ్యామిలీను ఉద్దేశ్యించి అల్లు అర్జున్ ఈ వ్యాఖ్యలు చేసారని సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది.

Allu Arjun – నిజంగా స్మగ్లింగ్‌ చేస్తే తప్పు పట్టాలి – అల్లు అర్జున్ మామ

ఈ నేపథ్యంలో మెగా, అల్లు ఫ్యామిలీ వార్ పై వస్తున్న వార్తలపై అల్లు అర్జున్‌ మామ కంచర్ల చంద్రశేఖర్‌రెడ్డి స్పందించారు. ఓ మీడియా ఛానల్‌ నిర్వహించిన చర్చా కార్యక్రమంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇప్పుడు హీరోలు స్మగ్లర్ల వేషాలు వేస్తున్నారు’ అంటూ పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు, ‘స్నేహితుల కోసం ఎక్కడిదాకా అయినా వస్తాను’ అంటూ అల్లు అర్జున్‌(Allu Arjun) చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. కళ్యాణ్‌ గారు ఏ సందర్భంలో అలా మాట్లాడారో తెలియదు. ఆయన మాటవరసకు అలా అని ఉంటారు అని నేను అనుకుంటున్నాను. కానీ ప్రజల్లోకి తప్పుడు సందేశం పోతోంది. తర్వాతైనా ఆయన ‘నా ఉద్దేశం ఇది’ అని చెబితే బాగుండేది. ఆయనే స్వయంగా పూనుకొని సరిదిద్దితే బాగుండేదని నా అభిప్రాయం.

ఎన్టీఆర్‌ నటుడిగా రావణుడు, దుర్యోధనుడి పాత్రలు పోషించారు. అంటే దానర్థం మొత్తం స్త్రీ జాతిని ఆయన కించపరిచాడని కాదు కదా. ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యారు. పవన్‌ కళ్యాణ్‌ కూడా నటుడిగా ఉండి రాజకీయ నాయకుడయ్యారు. సినిమా యాక్టర్‌ ను యాక్టర్‌ గానే చూడాలి. వారి వ్యక్తిత్వాలకు ఆ పాత్రల స్వభావాన్ని అంటగట్టే ప్రయత్నం చేయకూడదు. అల్లు అర్జున్‌(Allu Arjun) నిజంగా స్మగ్లింగ్‌ చేస్తే తప్పు పట్టాలి.

అల్లు అర్జున్‌కు జాతీయ ఉత్తమ నటుడి అవార్డ్‌ వచ్చింది. 69 ఏళ్లలో ఎవరికీ రాని అవార్డ్‌ ఆయన్ను వరించింది. ఆయన మిత్రపక్షం బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది. ఎన్డీయే ప్రభుత్వమే అర్జున్‌ కు ఉత్తమ నటుడు అవార్డ్‌ ఇచ్చింది. అది పవన్‌ కళ్యాణ్‌కు తెలియదా ? మంచీ చెడూ చూడకుండానే భారత ప్రభుత్వం ఆ పురస్కారాన్ని ఇవ్వలేదు కదా ?. ఆయన అభిమానులేమో అల్లు అర్జున్‌ నే అన్నాడు అని అనుకుంటున్నారు.

ఇప్పుడు ఈ వివాదానికి శుభం కార్డు పడాలంటే ‘ఇది నేను జనరల్‌గా అన్నాను’ అని పవన్‌ కళ్యాణ్‌ ఓ ప్రకటన చేయాలి. లేదంటే ఆయన భాగస్వామిగా ఉన్న ఎన్డీయే ప్రభుత్వాన్ని తప్పు పట్టినట్లే. భారత ప్రభుత్వ నిర్ణయాన్ని వివాదాస్పదం చేస్తున్నట్లుగానే భావించాలి. చిరంజీవి గారు పవన్‌ కళ్యాణ్‌, అల్లు అర్జున్‌(Allu Arjun) తో మాట్లాడి ఈ వివాదానికి ముగింపు పలకాలి అని ఆయన హితవు పలికారు. దీనితో ఈ వివాదం ఎటు వెళ్తుంతో అని అంతా ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read : Ruhani Sharma : తన సినిమాలో సీన్స్ లీక్ అవ్వడం బాధగా ఉందంటున్న రుహాణి

allu arjunAP Deputy CM Pawan KalyanKancharla Chandrasekhar ReddyMega Star Chiranjeevi
Comments (0)
Add Comment