Allu Arjun: తన ఇంట్లో పనిమనిషితో బన్నీ సెల్ఫీ వీడియో

తన ఇంట్లో పనిమనిషితో బన్నీ సెల్ఫీ వీడియో

Allu Arjun: ‘పుష్ప 2’ సినిమాతో బిజీగా ఉన్న అల్లు అర్జున్… కాసేపు షూటింగ్ కు బ్రేక్ గురువారం జరిగిన తెలంగాణ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. అయితే ఇదే టైంలో ఓ అమ్మాయితో బన్నీ ఉన్న సెల్ఫీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ సెల్ఫీ వీడియోలో ఉన్న ఆ అమ్మాయి ఎవరా అని ఆ వీడియో చూస్తే… ఆ అమ్మాయి అల్లు అర్జున్ ఇంట్లో పనిమనిషి అని తెలిసింది. ఇన్ స్టాలో యాక్టివ్ గా ఉండే ఆమె… ఫాలోవర్స్ ను పెంచడానికి బన్నీ సెల్ఫీ వీడియో ద్వారా హెల్ప్ చేసినట్లు తెలుస్తోంది.

Allu Arjun – బన్నీ సెల్ఫీ వీడియోలో ఏముందంటే

బన్నీ తన ఇంట్లో పెరట్లో ఉండగా ఓ అమ్మాయి దగ్గర సెల్ ఫోన్ తీసుకుని… ‘నీకు బాగా ఫాలోవర్స్ రావాలని మంచి వీడియో తీస్తా సరేనా, ఎంతమంది ఫాలోవర్స్ కావాలి? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు?’ అని బన్నీ అనగా… ఆ అమ్మాయి 13k అని చెప్పింది. ‘మినిమం ఎంత టచ్ అవ్వాలి?’ అని బన్నీ అడగ్గా… ఓ 20k లేదా 30k అని ఆ అమ్మాయి చెప్పింది… ఈ వీడియోతో వస్తారా ? అని అల్లు అర్జున్(Allu Arjun) అడుగుతూ ఆ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బన్నీ తన ఇంట్లో పనిమనిషికి చేసిన హెల్ప్ పై నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. బన్నీ వీడియో అంటే 30k ఏంటి 300k ఫాలోవర్స్ ను సాధించడం ఖాయం అంటూ ఆ పనిమనిషికి అభినందనలు తెలుపుతున్నారు.

Also Read : Kirak RP: రహస్యంగా పెళ్ళి చేసుకున్న జబర్దస్త్ కమెడీయన్

allu arjunpuspha
Comments (0)
Add Comment