Allu Arjun : అంచ‌నాల‌కు మించి పుష్ప‌- 2

న‌టుడు అల్లు అర్జున్

Allu Arjun : టాలీవుడ్ ఐకాన్ స్టార్, జాతీయ ఉత్త‌మ న‌టుడు అల్లు అర్జున్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప‌-2 మూవీ పుష్ప ది రైజ్ కంటే అద్భుతంగా ఉంటుంద‌ని పేర్కొన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు.

Allu Arjun Speaks about Pushpa-2

మ‌రింత గొప్ప‌గా ఉండాల‌ని కోరుకుంటూ తాను శ‌క్తి వంచ‌న లేకుండా కృషి చేస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు అల్లు అర్జున్(Allu Arjun). పుష్ప కంటే భిన్నంగా ఉండాల‌ని ఆశిస్తున్నామ‌ని పేర్కొన్నారు. సంగీత ప‌రంగా , డైలాగుల ప‌రంగా, చిత్రీక‌ర‌ణ ప‌రంగా టాప్ రేంజ్ లో ఉంటుంద‌ని , ఇందుకు తాను హామీ ఇస్తున్నాన‌ని అన్నారు.

క‌చ్చితంగా పుష్ప‌-2 బాక్సులు బ‌ద్ద‌లు కొట్ట‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు అల్లు అర్జున్. ఇదిలా ఉండ‌గా ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా అల్లు అర్జున్ తో పాటు ర‌ష్మిక మందాన న‌టిస్తోంది. చంద్ర‌బోస్ పాట‌లు రాస్తుండ‌గా దేవిశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

పుష్ప‌-2 చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇప్ప‌టికే ఈ చిత్రంపై ఆశించిన దానికంటే ఎక్కువ డిమాండ్ నెల‌కొన‌డం నిర్మాత‌ల‌ను విస్తు పోయేలా చేస్తోంది. మొత్తంగా అల్లు అర్జున్ మేనియా సినీ రంగాన్ని ఊపేస్తోంది. జాతీయ ఉత్త‌మ న‌టుడిగా ఎంపిక కావ‌డం మ‌రింత ఆస‌క్తిని రేపుతోంది.

Also Read : Khushi Movie : యుఎస్ లో ఖుషీ బుకింగ్ స్టార్ట్

Comments (0)
Add Comment