Hero Allu Arjun: ‘హాయ్‌ నాన్న’ పై బన్నీ ఎమోషనల్ ట్వీట్

'హాయ్‌ నాన్న' పై బన్నీ ఎమోషనల్ ట్వీట్

Allu Arjun: యువ దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా బేబీ కియారా ముఖ్య పాత్రలో తెరకెక్కిన సినిమా ‘హాయ్‌ నాన్న’. డిసెంబరు 7న విడుదలైన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమాను వీక్షించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్… ‘హాయ్‌ నాన్న’ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. మధురమైన చిత్రమని, మనసుకు హత్తుకుందని కొనియాడుతూ తన సోషల్ మీడియా అకౌంట్ ఎక్స్ ద్వారా చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు.

Allu Arjun – హాయ్‌ నాన్న చూసి.. బన్నీ ఏమన్నారంటే! 

‘హాయ్‌ నాన్న’ సినిమా చూసిన అనంతరం ఈ సినిమాపై ప్రత్యేక రివ్యూ రాసిన అల్లు అర్జున్(Allu Arjun)…. “సోదరుడు నాని నటన అద్భుతం. ఆక్షణీయమైన స్క్రిప్ట్ను వెలుగులోకి తెచ్చినందుకు ‘హాయ్‌ నాన్న’ టీమ్ మీద నాకు మరింత రెస్పెక్ట్‌ పెరిగింది. మృణాల్‌ నటన మనసుకు హత్తుకుంది. ఆ పాత్ర ఆమెకులాగే బ్యూటిఫుల్‌గా ఉంది. మై డార్లింగ్ బేబీ కియారా… తన క్యూట్‌నెస్‌తో మనసుల్ని కరిగించేసింది. మిగిలిన ఆర్టిస్ట్‌లు కూడా ఎక్కడా పేరు పెట్టడానికి లేకుండా తమ ప్రతిభను చూపించారు.

సాంకేతిక నిపుణుల అద్భుతమైన పని తెరపై స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా కెమెరామెన్ సాను జాన్ వర్గీస్‌, సంగీత దర్శకుడు హేషమ్‌ అబ్దుల్‌ వాహబ్‌ లు… గొప్ప టెక్నీషియన్స అని ఈ సినిమా ద్వారా నిరూపించుకున్నారు. ఇక దర్శకుడు శౌర్యువ్‌ తొలి చిత్రంతోనే అందరినీ ఆకట్టుకున్నారు. ఎన్నో హృదయాలను హత్తుకునేలా, కంట తడి పెట్టేలా సన్నివేశాలను క్రియేట్‌ చేశారు. సీన్స్ ప్రజంటేషన్ చాలా బావుంది. ప్రతి సన్నివేశాన్ని చాలా మెచూర్డ్‌గా చిత్రీకరించారు, అద్భుతమైన స్క్రిప్ట్ను ఎంకరేజ్‌ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన నిర్మాతలకు అభినందనలు. ‘హాయ్‌ నాన్న’ చిత్రం తండ్రులనే కాకుండా ప్రతి కుటుంబ సభ్యుడి హృదయాన్ని హత్తుకుంటుంది’’ అని అల్లు అర్జున్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

బన్నీ ట్వీట్ కు నాని రిప్లై

‘హాయ్‌ నాన్న’ సినిమా చూడటమే కాకుండా… తన రివ్యూ ద్వారా చిత్ర యూనిట్ పై సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్(Allu Arjun) చేసిన ట్వీట్ కు హీరో నాని స్పందించారు. ”హాయ్‌ నాన్న’ సినిమాను అర్హా తండ్రి ఆమోదించారు. మంచి సినిమా కోసం మీరు ఎప్పుడూ నిలబడతారు. థ్యాంక్యూ సో మచ్ బన్నీ’ అంటూ నాని ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు.

తండ్రి సెంటిమెంట్ కు అల్లు అర్జున్ ఫిదా

అల్లు అర్జున్ కు తన తండ్రి అల్లు అరవింద్ అంటే చాలా ఇష్టం. ఈ విషయాన్ని ఎన్నో సార్లు పలు వేదికలపై చెప్పడమే కాకుండా ఎమోషనల్ కూడా అయ్యారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కించిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా అయితే కేవలం తన తండ్రి అల్లు అరవింద్ ను దృష్టిలో ఉంచుకుని చేసానని వేదికపై ఎమోషనల్ గా చెప్పారు. ఈ నేపథ్‌యంలోనే ‘హాయ్‌ నాన్న’ సినిమాకు బన్నీ బాగా కనెక్టయ్యారు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Also Read : Captain Vijayakanth: ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన విజయకాంత్‌

allu arjunHero NaniNani
Comments (0)
Add Comment