Allu Arjun : సంధ్య థియేటర్ కేసులపై స్పందించిన అల్లు అర్జున్

తాజాగా ఈ కేసులపై నటుడు అల్లు అర్జున్ హైకోర్టును ఆశ్రయించాడు...

Allu Arjun : అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా డిసెంబర్ 5న గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే విడుదలకు ముందురోజు రాత్రి హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో ప్రదర్శించబడిన ప్రీమియర్‌కు అల్లు అర్జున్(Allu Arjun) రావడంతో తొక్కిసలాట జరిగి ఓ కుటుంబంలో విషాదం నింపింది. ‘పుష్ప2’ సినిమాను చూసేందుకు వచ్చిన రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కుమారుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో అల్లు అర్జున్ తో పాటు థియేటర్ యాజమాన్యంపై నమోదైంది.

Allu Arjun Comment

తాజాగా ఈ కేసులపై నటుడు అల్లు అర్జున్(Allu Arjun) హైకోర్టును ఆశ్రయించాడు. తనపై నమోదు చేసిన కేసులను కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో న్యాయస్థానం తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌ ని చిక్కడపల్లి పోలీసులు నిందితుల లిస్ట్ లో చేర్చారు. బిఎన్ఎస్ చట్టంలోని సెక్షన్ 105 ప్రకారం హత్య కాని ప్రాణనష్టం కేసు, 118(1) వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ తరహా కేసుల్లో నేరం రుజువైతే ఐదు నుంచి గరిష్ఠంగా పదేళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశముంది. అల్లు అర్జున్ వస్తున్న విషయంపై తమకు ఎవరూ సమాచారం ఇవ్వలేదని పోలీసులు ఇప్పటికే వెల్లడించారు.

మరోవైపుపుష్ప- 2 ప్రీమియర్‌ షోలో రేవతి అనే మహిళ మృతికి, తమకు ఎలాంటి సంబంధం లేదని సంధ్య థియేటర్‌ యజమానులు తెలిపారు. అందువల్ల తమపై పోలీసులు పెట్టిన కేసును కొట్టేయాలని కోరుతూ యజమానురాలు రేణుకాదేవి, ఇతరులతో పాటు సంధ్య సినీ ఎంటర్‌ప్రైజ్‌ సంస్థ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. థియేటర్‌ తమదే అయినప్పటికీ ప్రీమియర్‌ షోతో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఆ షోను డిస్ట్రిబ్యూటర్లు నిర్వహించారని, ప్రీమియర్‌ షో, బెనిఫిట్‌ షోలకు అనుమతిస్తూ ప్రభుత్వం మెమో సైతం జారీ చేసిందని తెలిపారు. థియేటర్‌ మైత్రీ డిస్ట్రిబ్యూటర్‌ ఆధీనంలో ఉందని తెలిపారు. అయినప్పటికీ తమ బాధ్యతగా తాము బందోబస్తు కల్పించాలని, జనాలను అదుపు చేయాలని పోలీసులకు వినతి పత్రం సమర్పించామని తెలిపారు. కొంతమంది పోలీసులు బందోబస్తుకు వచ్చినప్పటికీ విపరీతమైన తోపులాట వల్ల ప్రమాదం జరిగినట్లు పేర్కొన్నారు.

Also Read : Mohan Babu-TG High Court : నటుడు మోహన్ బాబుకు ఆ కేసులో ఉరటనిచ్చిన హైకోర్టు

allu arjunCommentsTrendingUpdatesViral
Comments (0)
Add Comment