Allu Arjun-Pushpa 2 : బన్నీకి ఓ పెద్ద టాస్క్ ఇచ్చిన తెలంగాణ సర్కార్

ఇక ఈ సినిమా రన్ టైమ్ విషయానికొస్తే....

Allu Arjun : ‘పుష్ప 2’ కోసం సినీ ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ వరుసగా భారీ ప్రమోషన్ ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. పాట్నా, చెన్నై ఈవెంట్ లతో పాటు బుధవారం కొచ్చిన్ లో జరిగిన ఈవెంట్ కి కూడా భారీ రెస్పాన్స్ వచ్చింది. నెక్స్ట్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ ఈవెంట్ ని హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో సర్ప్రైజ్ ప్లాన్స్ తో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ నవంబర్ 31న లేదా డిసెంబర్ 1న నిర్వహించనున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే బన్నీ(Allu Arjun)కి తెలంగాణ గవర్నమెంట్ ఒక టాస్క్ ఇచ్చింది.

Allu Arjun-Pushpa 2 Updates

ఇటీవల దేవర సినిమా రిలీజ్ ముందు హీరో ఎన్టీఆర్ తో తెలంగాణ ప్రభుత్వం యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ వీడియో చేయించిన విషయం తెలిసిందే. భారీ సినిమాల రిలీజ్ ముందు టికెట్ రేట్లు పెంచుకునే పర్మిషన్ విషయంలో తెలంగాణ సర్కార్ చాకచక్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం దగ్గరికి వచ్చిన ఏ హీరో అయినా అంటి డ్రగ్స్ క్యాంపెయిన్ చేయాల్సిందే అని షరతుని పెట్టినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కూడా యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ చేయనున్నారు. దీంతో ప్రజలని చైతన్యపరచడంతో పాటు సినిమా ప్రమోషన్ కూడా అయిపోతుంది.

ఇక ఈ సినిమా రన్ టైమ్ విషయానికొస్తే.. సుకుమార్ సినిమాలంటేనే మినిమమ్ 3 గంటల రన్ టైమ్ కామన్. పుష్ప సినిమాకి ఒక నిమిషం తక్కువ 3 గంటలు చేసిన సుక్కు ఈ సారి 3 గంటల 22 నిమిషాల రన్ టైమ్ ని ఫిక్స్ చేశారు. యూఎస్ రన్ టైమ్ ని 3 గంటల 15 నిమిషాలకు కుదించారు. దీంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎట్టకేలకు ఈ సినిమా షూటింగ్ ముగియడంతో ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే సందీప్ రెడ్డి వంగా ‘యానిమల్’ సినిమా 3 గంటల 22 నిమిషాల లాంగ్ రన్ టైమ్ తో విడుదలై సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలోనే పుష్ప రన్ టైమ్ గురించి వర్రీ కావాల్సిన పనిలేదంటున్నారు. ఎంగేజింగ్ కథతో ప్రేక్షకులని కటిపడేస్తే ‘పుష్ప రాజ్’ మేనియని ఆపేవారే లేరు.

Also Read : Hero Siddharth : అతిథి తో మరోసారి పెళ్లి పీటలెక్కిన హీరో సిద్ధార్థ్

allu arjunCinemaPushpa 2Telangana CMTrendingUpdatesViral
Comments (0)
Add Comment