Hero Allu Arjun- Pushpa 2: చిత్రం కాదు భావోద్వేగాల స‌మ్మేళ‌నం

ఇండియ‌న్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Allu Arjun : పుష్ప చిత్రం కాదు అది భావోద్వేగాల‌తో కూడిన స‌మ్మేళ‌నం. ఈ సినిమా కోసం 5 ఏళ్ల పాటు క‌లిసి ప్ర‌యాణం చేశాం. పుష్ప‌కు సంబంధించి సీక్వెల్ గా మ‌రోసారి రాబోతోందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. దీనిపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు బ‌న్నీ(Allu Arjun). త‌ను న‌టించిన ఈ మూవీ జీవితంలో మ‌రిచి పోలేని స‌క్సెస్ ఇచ్చింద‌న్నాడు. పుష్ప లోని ప్ర‌తి స‌న్నివేశం త‌న‌లో భాగ‌మై పోయింద‌న్నాడు.

Allu Arjun Pushpa 2..

ఒక‌టి కాదు ఏకంగా రూ. 1800 కోట్ల‌ను క్రాస్ చేయ‌డం త‌న‌ను విస్తు పోయేలా చేసింద‌న్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ ఖ‌ర్చు చేసి నిర్మించింది. న‌టీ న‌టుల‌నే కాదు సాంకేతిక వ‌ర్గాన్ని నిల‌బెట్టింద‌న్నాడు న‌టుడు. ప్ర‌తి స‌న్నివేశం తెర‌పై ప్ర‌తిఫ‌లించేలా చేసిన ఘ‌న‌త త‌న‌ది కాద‌ని ఇది కేవ‌లం ద‌ర్శ‌కుడు సుకుమార్ కే ద‌క్కుతుంద‌న్నాడు.

డిసెంబ‌ర్ 5న 2021లో వ‌చ్చింది పుష్ప‌. గ‌త ఏడాది 2024 డిసెంబ‌ర్ 5న మ‌రోసారి రిలీజ్ చేశారు సీక్వెల్ పుష్ప‌2ను. ఆక‌ట్టుకునే క‌థ‌నం, సంగీతం, న‌టీన‌టుల ప్ర‌ద‌ర్శ‌న ప్ర‌తి ఒక్క‌రినీ ఆక‌ట్టుకునేలా చేసింది. గుండెల‌ను మీటింది.

జాతీయ అవార్డు గెలుచుకున్న నటుడు తన సహనటులు రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్‌తో సహా సినిమా విజయానికి ప్రతి విభాగానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రెడిట్ అంతా సుకుమార్ కే ద‌క్కుతుంద‌న్నారు. డైరెక్ట‌ర్ ను స్వ‌చ్చంధ సృష్టిక‌ర్త అంటూ కితాబు ఇచ్చారు.

Also Read : భారీ క‌లెక్ష‌న్స్ వ‌స్తాయ‌ని అనుకోలేదు

allu arjunCommentsPushpa 2Trending
Comments (0)
Add Comment