Allu Arjun : ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సమ్మర్ వెకేషన్ నుంచి వచ్చేశాడు. తను సుకుమార్ దర్శకత్వంలో నటించిన పుష్ప-2 మూవీ చరిత్ర సృష్టించింది. ఈ సినిమా ఏకంగా భారత దేశంలో ఇప్పటి వరకు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో 2వ స్థానం పొందింది. ఏకంగా రూ. 1867 కోట్లను వసూలు చేసింది. ఈ చిత్రం గ్రాండ్ సక్సెస్ కావడంతో అల్లు అర్జున్(Allu Arjun) తదుపరి చిత్రం ఏమై ఉంటుందని ఊహాగానాలు ఊపందుకున్నాయి.
Allu Arjun-Atlee Kumar Movie Updates
మరో వైపు సుకుమార్ కీలక ప్రకటన చేశాడు. పుష్ప-2 తర్వాత పుష్ప-3 సీక్వెల్ కూడా ఉంటుందని, తారాగణంలో ఎలాంటి మార్పు లేదని పేర్కొన్నాడు. తాజాగా టాలీవుడ్ లో ఓ కీలక అప్ డేట్ వచ్చింది. అదేమిటంటే తమిళ సినీ రంగానికి చెందిన స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ తో మూవీ చేసేందుకు చర్చలు పూర్తయినట్లు టాక్.
ఇదిలా ఉండగా ఈ కొత్త ప్రాజెక్టుకు సంబంధించి మార్చి 20 నాటికి అధికారికంగా ఒప్పందాలు చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఎంతో ఉత్కంఠతో ఎదురు చూస్తున్న బిగ్ ప్రాజెక్టుకు సంబంధించి వివరాలను ఖరారు చేసేందుకు అట్లీ, సన్ పిక్చర్స్ తో సమావేశం కానున్నారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ సినిమాలో ఐదుగురు హీరోయిన్లు ఉంటారని అంచనా. ఇందు కోసం అమెరికన్, కొరియన్, ఇతర అంతర్జాతీయ తారలను ఎంపిక చేసే పనిలో అట్లీ పడ్డారని టాక్. జాన్వీ కపూర్ ను ఎంపిక చేయనున్నట్లు తెలిసింది.
Also Read : Hero Jr NTR-Hrithik War 2 :ఎన్టీఆర్..హృతిక్ రోషన్ నువ్వా నేనా