Hero Allu Arjun :అల్లు అర్జున్ న్యూ లుక్ అదుర్స్ 

సోషల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ 

Allu Arjun : ఇండియ‌న్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) గురించి ఎంత చెప్పినా త‌క్కువే. త‌ను న‌టించిన పుష్ప‌2 చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. అంతే కాదు భార‌తీయ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో రికార్డుల‌ను తిర‌గ రాసింది. అత్య‌ధిక వ‌సూలు చేసిన రెండ‌వ చిత్రంగా నిలిచింది. రికార్డ్ బ్రేక్ చేసింది. ఈ సినిమాకు డైన‌మిక్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వహించ‌గా నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా, స్పెష‌ల్ సాంగ్ లో ల‌వ్లీ బ్యూటీ శ్రీ‌లీల న‌టించారు. ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల‌లోకి ర‌ప్పించేలా చేయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. దీంతో బ‌న్నీపై అంచ‌నాలు మ‌రింత పెరిగేలా చేశాయి. త‌న త‌దుప‌రి చిత్రం ఏమిట‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

Allu Arjun New look Viral

సినీ వ‌ర్గాల ప్ర‌కారం త‌ను ప్ర‌ముఖ త‌మిళ చిత్ర ద‌ర్శ‌కుడు అట్లీ కుమార్ తో న‌టించేందుకు రెడీ అయ్యాడ‌ని, ఈ మేర‌కు క‌థ‌కు కూడా ఓకే చెప్పాడ‌ని టాక్. ఇందుకు సంబంధించి త‌ను ఎయిర్ పోర్ట్ నుంచి వ‌స్తుండ‌గా ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. న్యూ లుక్ తో చాలా అందంగా క‌నిపించాడు బ‌న్నీ. ఇందుకు సంబంధించిన ఫోటోస్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. కుర్ర‌కారు గుండెల్లో గుబులు రేపుతున్నాయి. ఈ న్యూ లుక్ కొత్త సినిమా కోస‌మేన‌ని పేర్కొంటున్నారు ఫ్యాన్స్.

పూర్తిగా న‌ల్ల‌టి దుస్తులతో క‌నిపించాడు. కూలింగ్ గ్లాసెస్ కూడా ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. భారీ బందోబ‌స్తు మ‌ధ్య ఎయిర్ పోర్ట్ నుంచి వెళ్లి పోయాడు.  ఇక అల్లు అర్జున్ హెయిర్ స్టైల్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అట్లీ బ‌న్నీతో మ‌ల్టీ స్టార‌ర్ మూవీ తీస్తున్నాడ‌ని, ఇందులో శివ కార్తికేయ‌న్ కూడా భాగం కానున్న‌ట్లు టాక్. ఇందులో ప్ర‌త్యేక‌త ఏమిటంటే ఐదుగురు హీరోయిన్లు న‌టిస్తుండ‌డం విశేషం. అయితే ఇంకా క‌న్ ఫ‌ర్మ్ చేయ‌లేదు ద‌ర్శ‌కుడు అట్లీ కుమార్.

Also Read : Hero Priyadarshi -Court Movie :కోర్ట్ చిత్రం అభినంద‌నీయం

allu arjunNew LookTrendingUpdates
Comments (0)
Add Comment