Hero Allu Arjun : బాలీవుడ్ డైరెక్ట‌ర్ తో బ‌న్నీ భేటీ

త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో మ‌రో మూవీ

Allu Arjun : ఇండియ‌న్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చ‌ర్చ‌నీయాంశంగా మారాడు. త‌ను సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన పుష్ప‌-2 మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. వ‌సూళ్ల ప‌రంగా రికార్డ్ సృష్టించింది. పుష్ప స‌క్సెస్ తో సీక్వెల్ గా ఉంటుందా లేదా అన్న‌ది ఇంకా క్లారిటీ రాలేదు. ఇటీవ‌ల పుష్ప‌-2 మూవీ ప్రీమియ‌ర్ షో సంద‌ర్బంగా చోటు చేసుకున్న ఘ‌ట‌న కేసులో అల్లు అర్జున్(Allu Arjun) అరెస్ట్ అయి బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చాడు.

Allu Arjun Meet..

తాజాగా త‌ను మ‌రో చిత్రంలో న‌టించేందుకు గాను ముంబైకి వెళ్లాడు. ఇందులో భాగంగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా బ‌న్సాలీతో భేటీ అయ్యాడని టాక్. స‌మావేశంలో ఏం చ‌ర్చించార‌నేది ఇంకా తెలియ రాలేదు.

పుష్ప‌-2 మూవీని ఉత్త‌రాది ప్రేక్ష‌కులు అనూహ్యంగా ఆద‌రించారు. భారీ ఎత్తున క‌లెక్ష‌న్లు కూడా వ‌చ్చాయి. ఇక్క‌డ కూడా తక్కువ రోజుల్లోనే వ‌సూళ్లు చేసిన చిత్రంగా టాప్ లో నిలిచింది. దీంతో త‌నదైన మార్క్ న‌ట‌న‌తో బాలీవుడ్ లో పాగా వేయాల‌ని చూస్తున్నాడు బ‌న్నీ. త‌న‌ను త‌మ స్వంత న‌టుడిగా భావిస్తున్నారు ఇక్క‌డి ఫ్యాన్స్. అంత‌కు ముందు మ‌రో పాన్ ఇండియా డైరెక్ట‌ర్ అట్లీతో కూడా చ‌ర్చ‌లు జ‌రిపాడు అల్లు అర్జున్. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు.

మ‌రో వైపు బాలీవుడ్ డైరెక్ట‌ర్ తో చ‌ర్చ‌లు ఫ‌ల‌ప్ర‌దం అయితే..తెలుగులో దిగ్గ‌జ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో మ‌రో సినిమాకు బ‌న్నీ ప్లాన్ చేస్తున్న‌ట్లు టాక్.

Also Read : Hero Balakrishna Movie : బాల‌య్య డాకూ మ‌హారాజ్ పై ఉత్కంఠ

allu arjunBollywood DirectorMeetSanjay Leela BansaliTrendingUpdates
Comments (0)
Add Comment