Allu Arjun : ఏదైనా నాకు నచ్చితే చేస్తాను..ఇష్టమైతేనే వెళ్తాను

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌కు మధ్య ఎలాంటి విబేధాలు లేవని మరోసారి స్పష్టం చేశారు బన్నీ...

Allu Arjun : ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌కు మధ్య ఎలాంటి విబేధాలు లేవని మరోసారి స్పష్టం చేశారు బన్నీ. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘మారుతీ నగర్‌ సుబ్రమణ్యం’ ప్రీ రిలీజ్‌ వేడుకలో అల్లు అర్జున్‌(Allu Arjun) , సుకుమార్‌ అతిథులుగా హాజరయ్యారు. రావు రమేశ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రానికి సుకుమార్‌ భార్య తబిత సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. అయితే కొంతకాలంగా సుకుమార్, బన్నీల మధ్య క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ వచ్చాయని, దాని వల్లే పుష్ప-2 డిలే అవుతుందని వార్తలొచ్చాయి. దీనిపై నిర్మాత బన్సీ వాసు వివరణ కూడా ఇచ్చారు. ” బన్నీ, సుకుమార్‌ ఎంత క్లోజ్‌ అనేది అందరికీ తెలుసు. దానికి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి వార్తలు చూసి మేం నవ్వుకున్నాం. సినిమాకు ఫ్రీగా పబ్లిసిటీ జరుగుతుందనుకున్నాం’’ అంటూ బన్నీ వాస్‌ చెప్పిన సంగతి తెలిసిందే!

Allu Arjun Comment…

తాజాగా ఇదే ఇష్యూపై మరోసారి క్లారిటీ వచ్చింది. ‘ మారుతీ నగర్‌ సుబ్రమణ్యం(Maruthi Nagar Subrahmanyam)’ ఫ్రీ రిలీజ్‌ వేడుకకు ఇద్దరూ కలిసి రావడంతో ఇద్దరి మధ్య మైత్రి అలాగే ఉందని తెలుస్తోంది. అల్లు అర్జున్ స్పీచ్ కూడా సుకుమార్‌ కుటుంబానికి ఫేవర్‌గా ఉంది. ఎక్కడికైనా నాకు నచ్చితేనే వెళ్తానని, ఇష్టమైతేనే వస్తానని చెప్పడం ఆసక్తి కలిగించింది. ‘ తబితగారిది కంఫర్టబుల్‌ లైఫ్‌. అయినా ఏదో చేయాలనే తపనతో ఈ సినిమా తీశారు. ఆవి సుకుమార్‌ను రమ్మని పిలుస్తూ నాకు కూడా చెప్పి ప్రీ రిలీజ్‌ వేడుకకు రావాలన్నారు. అంతే మరో మాట లేకుండా వచ్చేశాను’’ అని అన్నారు. ఇక పుష్ష 2 గురించి మాట్లాడుతూ.. సినిమా వస్తున్న విధానం చూస్తుంటే ఏమాత్రం తగ్గేదేలే అనిపించేలా ఉంటుందనే నమ్మకం కలుగుతుంది. డిసెంబర్‌ 6న తగ్గేదేలే’’ అని బన్నీ అన్నారు.

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్‌కు మధ్య ఎలాంటి విబేధాలు లేవని మరోసారి స్పష్టం చేశారు బన్నీ. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో జరిగిన ‘మారుతీ నగర్‌ సుబ్రమణ్యం’ ప్రీ రిలీజ్‌ వేడుకలో అల్లు అర్జున్‌(Allu Arjun) , సుకుమార్‌ అతిథులుగా హాజరయ్యారు. రావు రమేశ కీలక పాత్ర పోషించిన ఈ చిత్రానికి సుకుమార్‌ భార్య తబిత సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. అయితే కొంతకాలంగా సుకుమార్, బన్నీల మధ్య క్రియేటివ్‌ డిఫరెన్సెస్‌ వచ్చాయని, దాని వల్లే పుష్ప-2 డిలే అవుతుందని వార్తలొచ్చాయి. దీనిపై నిర్మాత బన్సీ వాసు వివరణ కూడా ఇచ్చారు. ” బన్నీ, సుకుమార్‌ ఎంత క్లోజ్‌ అనేది అందరికీ తెలుసు. దానికి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి వార్తలు చూసి మేం నవ్వుకున్నాం. సినిమాకు ఫ్రీగా పబ్లిసిటీ జరుగుతుందనుకున్నాం’’ అంటూ బన్నీ వాస్‌ చెప్పిన సంగతి తెలిసిందే!

తాజాగా ఇదే ఇష్యూపై మరోసారి క్లారిటీ వచ్చింది. ‘ మారుతీ నగర్‌ సుబ్రమణ్యం(Maruthi Nagar Subrahmanyam)’ ఫ్రీ రిలీజ్‌ వేడుకకు ఇద్దరూ కలిసి రావడంతో ఇద్దరి మధ్య మైత్రి అలాగే ఉందని తెలుస్తోంది. అల్లు అర్జున్ స్పీచ్ కూడా సుకుమార్‌ కుటుంబానికి ఫేవర్‌గా ఉంది. ఎక్కడికైనా నాకు నచ్చితేనే వెళ్తానని, ఇష్టమైతేనే వస్తానని చెప్పడం ఆసక్తి కలిగించింది. ‘ తబితగారిది కంఫర్టబుల్‌ లైఫ్‌. అయినా ఏదో చేయాలనే తపనతో ఈ సినిమా తీశారు. ఆవి సుకుమార్‌ను రమ్మని పిలుస్తూ నాకు కూడా చెప్పి ప్రీ రిలీజ్‌ వేడుకకు రావాలన్నారు. అంతే మరో మాట లేకుండా వచ్చేశాను’’ అని అన్నారు. ఇక పుష్ష 2 గురించి మాట్లాడుతూ.. సినిమా వస్తున్న విధానం చూస్తుంటే ఏమాత్రం తగ్గేదేలే అనిపించేలా ఉంటుందనే నమ్మకం కలుగుతుంది. డిసెంబర్‌ 6న తగ్గేదేలే’’ అని బన్నీ అన్నారు.

Also Read : Megastar Chiranjeevi : అందరివాడు పద్మవిభూషణుడుకి జన్మదిన శుభాకాంక్షలు

allu arjunBreakingCinemaCommentsMaruthi Nagar SubramanyamViral
Comments (0)
Add Comment