Allu Arjun : ఇండియన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సంచలనంగా మారారు. తను పుష్ప2 మూవీ ద్వారా దేశంలోనే అత్యధిక వసూలు చేసిన 2వ చిత్రంగా నిలిచింది. దీనికి సుకుమార్ దర్శకత్వం వహించగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించారు. అధికారికంగా ఈ చిత్రం ఏకంగా రూ. 1860 కోట్లు వసూలు చేసిందని వెల్లడించారు. ఇదే సమయంలో తను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు తమిళ అగ్ర దర్శకుడు అట్లీ కుమార్ తో ఓ మూవీలో నటించేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే కథకు కూడా ఓకే చెప్పినట్లు సమాచారం.
Allu Arjun Remuneration
ఇందులో భాగంగా మరో కీలక అప్ డేట్ వచ్చింది బన్నీ గురించి. దీనిని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది తమిళనాడుకు చెందిన సన్ పిక్చర్స్. అట్లీ తో తీయబోయే ఈ సినిమాలో ఇప్పటికే హీరోయిన్స్ ను కూడా సెలెక్ట్ చేశారని, త్వరలోనే పూజా కార్యక్రమాలు జరగనున్నాయని వినికిడి. ఇదే సమయంలో మరో సంచలన వార్త వెలుగు చూసింది. పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే అల్లు అర్జున్(Allu Arjun) తను అట్లీతో తీయబోయే చిత్రానికి గాను ఏకంగా సన్ పిక్చర్స్ నుంచి రూ. 175 కోట్లకు రెమ్యూనరేషన్ పరంగా తీసుకున్నట్లు టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది.
దీంతో ఐకాన్ స్టార్ పారితోషకం పరంగా చూస్తే దేశంలోనే అత్యధికంగా తీసుకునే హీరోగా చరిత్ర సృష్టించనున్నాడు. కాగా ఈ రెమ్యూనరేషన్ గురించి ఇంకా ధ్రువీకరించలేదు దర్శకుడు అట్లీ కానీ, నిర్మాత సంస్థ సన్ పిక్చర్స్ కానీ, నటుడు బన్నీ కానీ.
Also Read : Spirit -Vijay Sethupathi : స్పిరిట్ లో విలన్ గా విజయ్ సేతుపతి