Allu Arjun: పుష్ప- 2 షూటింగ్‌కు బ్రేక్‌… కారణం అదేనా !

పుష్ప- 2 షూటింగ్‌కు బ్రేక్‌... కారణం అదేనా !

Allu Arjun: ‘పుష్ప 2 ది రూల్’ షూటింగ్‌ లో బిజీగా ఉన్న ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌… గురువారం (నవంబరు 30) తెలంగాణా ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆ తరువాత తన ఇంట్లో పనిచేసే పనిమనిషితో ఓ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసి… ఇన్ స్టా గ్రామ్ లో ఆమె ఫాలోవర్స్ ను పెంచడానికి సహకరించారు. అయితే ఓటు హక్కు వినియోగించుకోవడానికే అల్లు అర్జున్(Allu Arjun) షూటింగ్ కు గ్యాప్ ఇచ్చాడు అనుకున్న వారికి దర్శకుడు సుకుమార్ షాక్ ఇచ్చారు. గత నెల రోజులుగా రెస్ట్ లేకుండా కీలకమైన పాట, ఫైట్ ను చిత్రీకరిస్తుండటంతో అల్లు అర్జున్ వెన్ను నొప్పితో బాధపడుతున్నారని చిత్ర వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్(Allu Arjun) వద్దన్నప్పటికీ దర్శకుడు సుకుమార్… షూటింగ్ కు బ్రేక్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Allu Arjun – కీలక ఫైట్, పాట చిత్రీకరణలో వెన్నునొప్పితో బాధపడుతున్న బన్నీ

రామోజీ ఫిల్మ్ సిటీ వేదికగా భారీ జాతర సెట్ ను వేసిన చిత్ర యూనిట్ గత నెల రోజుల నుండి సినిమాలో అత్యంత కీలకమైన పాట, ఫైట్ ను చిత్రీకరిస్తున్నారు. సుమారు వెయ్యి మంది డ్యాన్సర్లతో తెరకెక్కిస్తున్న పాటతో పాటు భారీ యాక్షన్ సీన్స్ కూడా చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెల రోజుల నుండి రెస్ట్ లేకుండా భారీ కాస్ట్యూమ్స్‌తో ఫైటింగ్‌ సీన్స్‌లో రిస్క్‌ చేయడం వల్ల బన్నీకు వెన్ను నొప్పి వచ్చిందని సమాచారం. అయితే సినిమా చిత్రీకరణ ఇప్పటికే ఆలష్యం కావడంతో వెన్నునొప్పి ఉన్నా సరే షూటింగ్‌ కొనసాగించమని సుకుమార్‌ను బన్నీ కోరాడట.

అయితే సుకుమార్‌ మాత్రం అందుకు అంగీకరించకపోవడంతో షూటింగ్‌ను తాత్కాలికంగా ఆపేశాడట. ఒకవేళ షూటింగ్‌ కొనసాగితే అది బన్నీ ఆరోగ్యంపై మరింత ప్రభావం చూపుతుందని… అందుకే కొన్ని రోజులు బ్రేక్‌ తీసుకుందామని సుకుమార్‌ తెలిపాడట. దీంతో షూటింగ్ కు రెండు వారాలు బ్రేక్ ఇచ్చి డిసెంబరు రెండవ వారంలో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి గాని సుకుమార్ లేదా బన్నీలలో ఎవరో ఒకరి నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read : Silk Smitha: మరోసారి తెరకెక్కుతున్న సిల్క్‌ స్మిత బయోపిక్‌

allu arjunpusphasukumar
Comments (0)
Add Comment