Hero Allu Arjun :స్పెయిన్ లో అల్లు అర్జున్ ఫ్యామిలీ

హాలీ డే మూడ్ లో ఇండియ‌న్ ఐకాన్ స్టార్

Allu Arjun : ఇండియ‌న్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) న‌టించిన పుష్ప‌2 మూవీ రికార్డ్ బ్రేక్ చేసింది. ఏకంగా రూ. 2,000 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. డిసెంబ‌ర్ 5న విడుద‌లైన ఈ చిత్రం రికార్డుల‌ను తిర‌గ రాసింది. ప్ర‌స్తుతం సీక్వెల్ మూవీ కిక్కు ఎక్కించేలా చేయ‌డంతో బ‌న్నీ ఫుల్ సంతోషంగా ఉన్నాడు. స‌మ్మ‌ర్ వెకేష‌న్ కోస‌మ‌ని త‌న ఫ్యామిలీతో క‌లిసి స్పెయిన్ కు వెళ్లాడు. అక్క‌డ ప్ర‌కృతి అందాల‌ను త‌న భార్య‌, పిల్ల‌ల‌తో ఎంజాయ్ చేస్తున్నారు అల్లు అర్జున్.

Hero Allu Arjun Spain Tour

పుష్ప‌2లో ఐకాన్ గా మారిన గ‌డ్డాన్ని తొల‌గించాడు బ‌న్నీ. ఏకంగా యంగ్ గా క‌నిపిస్తుండ‌డంతో ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు. భార్య స్నేహా రెడ్డి, పిల్ల‌లు అర్హ‌, అయాన్ ల‌తో క‌లిసి స్పెయిన్ ను జ‌ల్లెడ ప‌ట్టారు. ఇదే స‌మ‌యంలో డిటాక్సిఫికేష‌న్ పై కూడా దృష్టి పెట్టాడు .

ప్ర‌స్తుతం వెకేష‌న్ మూడ్ లో ఉన్న‌ప్ప‌టికీ త‌న నెక్స్ట్ ప్రాజెక్టు ఎవ‌రితో ఉంటుంద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది. టాలీవుడ్ సినీ వ‌ర్గాల అంచ‌నా మేర‌కు త‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ తో న‌టించ‌నున్న‌ట్లు జోరుగా ప్రచారం జ‌రుగుతోంది.

బ‌న్నీ, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో ఇప్ప‌టి వ‌ర‌కు రెండు సినిమాలు వ‌చ్చాయి. ఆ రెండూ బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచాయి. అందులో ఒక‌టి జులాయి కాగా రెండోది పూజా హెగ్డేతో క‌లిసి అల వైకుంఠ పురంలో.

Also Read : Producer SKN Shocking :తెలుగు రాని హీరోయిన్ల‌కే ప్ర‌యారిటీ

allu arjunFamilyTourTrendingUpdates
Comments (0)
Add Comment