Hero Allu Arjun :అల్లు అర్జున్ కు శుభాకాంక్ష‌ల వెల్లువ

ఇండియ‌న్ ఐకాన్ స్టార్ గా గుర్తింపు

Allu Arjun : ప్ర‌ముఖ న‌టుడు, ఇండియ‌న్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) పుట్టిన రోజు ఇవాళ‌. ఆయ‌న‌కు 43 ఏళ్లు. ఏప్రిల్ 8, 1982లో త‌మిళ‌నాడులో చెన్నైలో పుట్టాడు. త‌న తండ్రి ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్. త‌న‌కు మ‌రో పేరు కూడా ఉంది. అంద‌రూ త‌న‌ను బ‌న్నీ అని పిలుచుకుంటారు. మ‌ల్లు అర్జున్ , డ్యాన్సింగ్ డైన‌మెట్, స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ గా గుర్తింపు పొందాడు. 2001 నుంచి త‌ను సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చాడు.

Allu Arjun got wishes

ఆనాటి నుంచి నేటి దాకా త‌న ప్ర‌స్థానాన్ని విజ‌య‌వంతంగా కొన‌సాగిస్తూ వ‌చ్చాడు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన ఆర్య సూప‌ర్ హిట్ గా నిలిచింది. ఆ త‌ర్వాత ఆర్య 2 లో న‌టించాడు. అది కూడా హిట్టే. ఇదే కాంబోలో వ‌చ్చిన పుష్ప , పుష్ప‌2 భార‌త దేశ సినీ చ‌రిత్ర‌లో సంచ‌ల‌నం రేపింది. ఇది ఏకంగా రూ. 1867 కోట్లు వ‌సూలు చేసింది.

ప్ర‌స్తుతం స‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ పిక్చ‌ర్స్ తో ఒప్పందం చేసుకున్నాడు. త‌మిళ సూప‌ర్ డైరెక్ట‌ర్ అట్లీ కుమార్ తో సినిమా చేయ‌బోతున్నాడు. ఇందులో ఐదుగురు హీరోయిన్లు న‌టించ‌నున్న‌ట్టు టాక్. తాజాగా ప్ర‌ముఖ న‌టి ప్రియాంక చోప్రా కీ రోల్ పోషిస్తున్నారు. హ‌రీశ్ శంక‌ర్ తో దువ్వాడ జ‌గ‌న్నాథంలో న‌టించాడు. బోయ‌పాటి శ్రీ‌ను, త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ తో కూడా న‌టించాడు.

వ‌రుస‌గా రెండు సినిమాలు చేశాడు. ఒక‌టి జులాయి కాగా మ‌రోటి అల వైకుంఠ‌పురంలో..ఈ రెండు సూప‌ర్ స‌క్సెస్ అయ్యాయి. తాజాగా మూడో సినిమాకు ఓకే చెప్పాడు. ఇది పూర్తిగా పౌరాణిక నేప‌థ్యంతో రానుంద‌ని స‌మాచారం. ఒక సినిమాలో న‌టించేందుకు భారీ పారితోష‌కాన్ని తీసుకుంటాడ‌ని టాక్. రాబోయే మూవీకి త‌ను రూ. 150 కోట్లు తీసుకున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. త‌న భార్య స్నేహా రెడ్డి. త‌న‌కు ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నారు.

Also Read : Tahira Kashyap-Cancer Shocking :క్యాన్స‌ర్ కు గురైన న‌టి తాహిరా క‌శ్య‌ప్

allu arjunBest WishesBirthdayTrending
Comments (0)
Add Comment