Allu Arjun-Kiran Abbavaram : ‘క’ సినిమా హీరో కిరణ్ అబ్బవరం కి క్షమాపణలు చెప్పిన బన్నీ

సీన్ సీన్ కు ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్సులు, డైలాగులు, బన్నీ పర్ఫామెన్స్....

Allu Arjun : అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 సినిమా రిలీజ్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా ఎదురుచూస్తున్నారు. అందుకు తగ్గట్టే ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 05న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్లలో స్పీడ్ పెంచారు మేకర్స్. ఇందులో భాగంగానే ఆదివారం (నవంబర్ 17) పుష్ఫ 2 ట్రైలర్ ను రిలీజ్ చేశారు. బిహార్ రాజధాని పాట్నా వేదికగా ట్రైలర్ లాంఛింగ్ ఈవెంట్ అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏకంగా 2 లక్షల మంది జనాలు వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. ఇక పుష్ఫ 2 ట్రైలర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సీన్ సీన్ కు ఎలివేషన్స్, యాక్షన్ సీక్వెన్సులు, డైలాగులు, బన్నీ పర్ఫామెన్స్.. ఇలా నిజంగానే వైల్డ్ ఫైర్ ను తలపించిందని చెప్పవచ్చు. అందుకే రిలీజ్ చేసిన అతి కొద్ది సమయంలోనే యూట్యూబ్ రికార్డులు తిరగరాసేస్తోంది. సినీ అభిమానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా పుష్ప 2 ట్రైలర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) పుష్ఫ 2 ట్రైలర్ చాలా బాగుందని ట్విట్టర్ (ఎక్స్) వేదికగా పోస్ట్ పెట్టాడు. ‘వైల్డ్ ఫైర్.. డిసెంబర్ 5 కోసం వెయిటింగ్’ అని ట్వీట్ చేశాడు.

Allu Arjun Comment

కిరణ్అబ్బవరం ట్వీట్ కు వెంటనే స్పందించాడు అల్లు అర్జున్(Allu Arjun). ‘థాంక్యూ మై బ్రదర్.. అలాగే కంగ్రాట్స్.. నేను బిజీగా ఉండి మీ సినిమా ‘క’ చూడలేకపోయాను. తర్వాత కచ్చితంగా మూవీ చూసి నీకు కాల్ చేస్తాను’ ‘అని రిప్లై ఇచ్చాడు. దీనికి స్పందించిన కిరణ్ అబ్బవరం ‘థ్యాంక్యూ అన్నా, డిసెంబర్ 05 కోసం వెయిటింగ్ ‘ అని మెసేజ్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్స్, రీట్వీట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. అల్లు అర్జున్ సింప్లిసిటీనీ అందరూ మెచ్చుకుంటున్నారు. అంతకు ముందు హను రాఘవపూడి, రాజమౌళి, బాబీ, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, ప్రశాంత్ వర్మ, శ్రీకాంత్ ఓదెల, గోపీచంద్ మలినేని తదితర సినీ ప్రమఖులు పుష్ప 2 ట్రైలర్ ను మెచ్చుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

Also Read : Taapsee Pannu : డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ కి సై అంటున్న తాప్సీ

allu arjunCommentsKiran AbbavaramTrendingViral
Comments (0)
Add Comment