Thandel-Allu Arvind Shocking :మాకంత బెనిఫిట్ అక్క‌ర్లేదు

నిర్మాత అల్లు అర‌వింద్

Thandel : ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గీతా ఆర్ట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో చందూ మొండేటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తండేల్ మూవీకి సంబంధించి టికెట్ రేట్ల‌ను పెంచ‌మ‌ని తాము కోర‌లేదంటూ బాంబు పేల్చారు. తెలంగాణ ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించ లేద‌ని, ఎవ‌రో మీకు త‌ప్పుడు స‌మాచారం ఇచ్చారంటూ మండిప‌డ్డారు.

Allu Arvind Comments on Thandel Ticket Price Hikes

పెంచమంటూ దేబ‌రించాల్సిన ప‌ని లేద‌న్నారు. అంతే కాదు బెనిఫిట్ షో స్ కోసం కూడా ప‌ర్మిష‌న్ ఇవ్వాల‌ని కోర‌లేద‌న్నారు. మాకు అంత బెనిఫిట్ అవ‌స‌రం లేద‌న్నారు అల్లు అర‌వింద్(Allu Arvind). అయితే కేవ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో మాత్ర‌మే ధ‌ర‌లు పెంచమ‌ని కోరామ‌న్నారు. అది కూడా కేవ‌లం రూ. 50 మాత్ర‌మేన‌ని స్ప‌ష్టం చేశారు అగ్ర నిర్మాత‌.

ఇటీవ‌ల త‌న కొడుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన పుష్ప 2 తొక్కిస‌లాట‌లో చోటు చేసుకున్న ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. ఈ సంద‌ర్బంగా బ‌న్నీని అరెస్ట్ చేశారు. చివ‌ర‌కు కాంప్ర‌మైజ్ కావ‌డంతో గ‌త్యంత‌రం లేక రాజీ కుదిర్చే ప్ర‌య‌త్నం చేశారు ప్ర‌ముఖ నిర్మాత‌, తెలంగాణ ఫిలిం డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ దిల్ రాజు.

Also Read : Beauty Meenakshi Chaudhary :ఆ ఒక్క కోరిక మిగిలి పోయింది

Allu AravindCommentsShockingUpdatesViral
Comments (0)
Add Comment