Allu Aravind : కిమ్స్ హాస్పిటల్ లో వెంటిలేటర్ పై ఉన్న శ్రీతేజ్ ను కలిసిన అల్లు అరవింద్

కాగా మంగళవారం (డిసెంబర్ 18) రాత్రి శ్రీ తేజ్ ప్రత్యేక హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు...

Allu Aravind : ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ శ్రీతేజ్ ను పరామర్శించాడు. బుధవారం (డిసెంబర్ 18) సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రికి వెళ్లిన ఆయన అక్కడ బాలుడి కుటుంబ సభ్యులతో ప్రత్యేకంగా మాట్లాడారు. శ్రీతేజ్‌ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన దురదృష్టకరమని.. రేవతి కుటుంబాన్ని పూర్తిగా తాము ఆదుకుంటామని అల్లు అరవింద్(Allu Aravind) భరోసా ఇచ్చారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం మాకు పూర్తిస్థాయిలో సహకారం అందించిందన్నారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్‌ ఆస్పత్రికి రాలేకపోయారని వివరించారు. అర్జున్‌ తరపున నేను ఆస్పత్రికి వచ్చానని, బన్నీ కూడా త్వరలోనే వచ్చి బాలుడిని పరామర్శిస్తాడని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు.

Allu Aravind Meet…

కాగా మంగళవారం (డిసెంబర్ 18) రాత్రి శ్రీ తేజ్ ప్రత్యేక హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు. ‘ శ్రీతేజ్ కు వెంటిలేటర్ పై కృత్రిమ శ్వాస అందిస్తున్నాం. అతని జ్వరం పెరుగుతోంది. మినిమం ఐనోట్రోప్స్‌లో ముఖ్యమైన పారామీటర్స్ స్థిరంగా ఉన్నాయి. ఫీడ్‌లను కూడా బాగానే తట్టుకుంటున్నాడు. అలాగనీ అతను పూర్తిగా హెల్దీగా ఉన్నాడని ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుతం అతని హెల్త్ కండిషన్ దృష్ట్యా.. వెంటి లేటర్ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. శ్రీతేజ్‌కు మెదడుకి ఆక్సిజన్ సరిగ్గా అందడం లేదు. ప్రస్తుతం ట్యూబ్ ద్వారా మాత్రమే ఆహారం అందిస్తున్నాం’ అని వైద్యులు తెలిపారు. కాగా ఆస్పత్రిలో పిల్లాడికి కావాల్సిన అన్ని వైద్య సదుపాయాలు పుష్ప 2 చిత్ర బృందం కల్పిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల సింగపూర్ నుంచి ప్రత్యేకంగా ఇంజెక్షన్ కూడా తెప్పించారు. ఇక ఈ ఘటన జరిగిన రోజు నుంచి నిర్మాత బన్నీవాస్‌, మైత్రీ నిర్మాతలు, హీరో అల్లు అర్జున్‌ అండ్‌ టీమ్‌ ఎప్పటికప్పుడూ శ్రీతేజ్‌ హెల్త్ అప్ డేట్స్ ను తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా నిర్మాత బన్నీవాస్‌ తరుచుగా ఆస్పత్రికి వస్తూ శ్రీతేజ్‌ యోగాక్షేమాలు తెలుసుకుంటున్నారు.

Also Read : Vijay Sethupathi : అభిమాని ప్రశ్నకు భగ్గుమన్న తమిళ హీరో విజయ్ సేతుపతి

Allu AravindMeetUpdatesViral
Comments (0)
Add Comment