Hero Bunny-Allu Aravind:బ‌న్నీ చెప్పాకే దేవిశ్రీ‌ని ఓకే చేశా

నిర్మాత అల్లు అర‌వింద్ కామెంట్స్

Allu Aravind : అక్కినేని నాగ చైత‌న్య‌, నేచుర‌ల్ బ్యూటీ సాయి ప‌ల్లవి క‌లిసి న‌టించిన తండేల్ మూవీ మ‌రింత ఆస‌క్తిని రేపుతోంది. క‌థ న‌చ్చితేనే దానికి ఓకే చెప్పేస్తారు ఏ మాత్రం సంకోచించ‌కుండా నిర్మాత అల్లు అర‌వింద్. త‌ను ఏ సినిమా చేసినా దానికి ఓ ప్ర‌త్యేకత ఉంటుంది. ఎక్క‌డ టాలెంట్ ఉన్నా వెంట‌నే ప‌సిగ‌డ‌తారు. వెన్నుత‌ట్టి ప్రోత్స‌హిస్తారు. ఇదే స‌మ‌యంలో ఆహా ఓటీటీ కూడా త‌న క‌నుస‌న్న‌ల‌లోనే న‌డుస్తోంది. ఇది ప‌క్క‌న పెడితే త‌ను తండేల్ మూవీని పెద్ద‌గా ప్ర‌మోట్ చేసే ప‌నిలో ప‌డ్డారు. త‌న‌తో పాటు హీరో హీరోయిన్లు కూడా అటెండ్ కావ‌డం, సినిమాకు సంబంధించిన విశేషాలు పంచుకుంటున్నారు.

Allu Aravind Comments

తాజాగా చిట్ చాట్ సంద‌ర్బంగా నిర్మాత అల్లు అర‌వింద్(Allu Aravind) సంచ‌ల‌న విష‌యం వెల్ల‌డించారు. తండేల్ మూవీ వెరీ స్పెష‌ల్. ఇందుకు మ‌న‌సు పెట్టి సంగీతం అందించాల్సి ఉంటుంది. ప్ర‌త్యేకించి గ్రామీణ నేప‌థ్యం, ప్రేమ‌, భావోద్వేగాల‌కు ఎక్కువ‌గా ప్ర‌యారిటీ ఇస్తూ సినిమాను తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు.

ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి సంగీత ద‌ర్శ‌కుడిగా ఎవ‌రిని పెట్టుకోవాల‌నే దానిపై సినిమా షూటింగ్ సంద‌ర్బంగా చ‌ర్చ‌కు వ‌చ్చింద‌ని చెప్పాడు అల్లు అర‌వింద్. త‌ను దేవిశ్రీ ప్రసాద్ ను వ‌ద్ద‌న్నాన‌ని, ఎందుకంటే త‌ను పుష్ప‌2లో బిజీగా ఉన్నాడు. ఇదే స‌మ‌యంలో మ‌న సినిమాకు చేస్తే ఆ మూవీపై ఫోక‌స్ పెట్టలేడ‌ని , కానీ బ‌న్నీ జోక్యం చేసుకోవ‌డంతో తండేల్ కు ఓకే చేశాన‌ని చెప్పాడు. ప్ర‌స్తుతం తండేల్ పాట‌లు త‌ళుక్కుమంటున్నాయి. జ‌నాద‌ర‌ణ చూర‌గొంటున్నాయి.

Also Read : Dil Raju- Shocking Comment:స్టార్ హీరోలపై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్

Allu Aravindallu arjunCommentsDSP MusicViral
Comments (0)
Add Comment