Allu Aravind : నా బిడ్డను అలా చూస్తుంటే మనసుకి చాలా బాధగా ఉంది

అల్లు అర్జున్ మాట్లాడిన తర్వాత అల్లు అరవింద్ కూడా మీడియాతో మాట్లాడారు...

Allu Aravind : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శనివారం అసెంబ్లీలో సంధ్య థియేటర్ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అల్లు అర్జున్ పోలీసు వాళ్లు చెప్పినా వినలేదంటూ అసెంబ్లీ సాక్షిగా చెప్పడంతో.. మరోసారి సంధ్య థియేటర్ ఘటన వార్తలలో హైలెట్ అవుతుంది. అయితే సీఎం చేసిన వ్యాఖ్యలను ఖండించేందుకు అల్లు అర్జున్ తన తండ్రి అల్లు అరవింద్(Allu Aravind), లీగల్ టీమ్‌తో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తూ.. తన వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారని ఈ మీడియా సమావేశంలో అల్లు అర్జున్ చెప్పుకొచ్చారు.

Allu Aravind Comment

అల్లు అర్జున్ మాట్లాడిన తర్వాత అల్లు అరవింద్ కూడా మీడియాతో మాట్లాడారు. ఈ సంఘటన జరిగినప్పటి నుండి అల్లు అర్జున్ ఎంతో బాధపడుతున్నాడని చెప్పుకొచ్చారు. ఎవరితో కలవలేకపోతున్నాడని, ఒంటరిగా కూర్చుని తనలో తనే బాధపడటం చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని అరవింద్ చెప్పుకొచ్చారు. భారతీయ సినీ చరిత్రలోనే ‘పుష్ప-2’ సినిమా కలెక్షన్ల రికార్డులు బ్రేక్ చేసి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతంది. కానీ, సినిమా కోసం అంత కష్టపడిన అర్జున్.. థియేటర్‌‌లో మొదటి షోకి వెళ్లి.. ప్రేక్షకులు తనపై చూపించే ప్రేమను కళ్లారా చూడలేని పరిస్థితి నెలకొంది. సంధ్యా థియేటర్ ఘటన చాలా దురదృష్టకరం. ఆ ఘటనతో బన్నీ ఎంతో ఆవేదనకు గురయ్యారు. గత రెండు వారాలుగా ఇంట్లో ఉన్న గార్డెన్‌లోనే బన్నీ గడుపుతున్నాడు. స్నేహితులు లేదా బంధువులు ఇళ్లకి వెళ్లమని చెప్పినా వెళ్లడం లేదు. అర్జున్ అలా చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. దయచేసి నా కుమారుడిపై ఇకనైనా తప్పుడు ప్రచారం ఆపాలని విజ్ఞప్తి చేస్తున్నానని అల్లు అరవింద్ మీడియా ద్వారా కోరారు.

Also Read : Allu Arjun : అసెంబ్లీ సాక్షిగా సీఎం వ్యాఖ్యలపై ప్రెస్ మీట్ పెట్టిన అల్లు అర్జున్

Allu Aravindallu arjunCommentsViral
Comments (0)
Add Comment