Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ తనదే అంటున్న అల్లరి నరేష్

'ఆ ఒక్కటీ అడక్కు' తనదే అంటున్న అల్లరి నరేష్

Allari Naresh: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రేక్షకాదరణ పొందిన కామెడీ సినిమాల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ ఒకటి. ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ దర్వకత్వంలో రాజేంద్ర ప్రసాద్ హీరోగా, రంభను టాలీవుడ్ కు పరిచయం చేసిన ఈ సినిమాకు ఇళయరాజా సంగీతం అందించారు. రావుగోపాలరావు, బాబూ మోహన్, నిర్మలమ్మ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమా రాజేంద్రప్రసాద్, ఈవీవీ సత్యనారాయణలకు సినీ జీవితంలో తిరుగులేని హిట్ గా ఈ సినిమా నిలిచింది. అయితే ఈ ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్ ను వాడేయడానికి సిద్ధమౌతున్నారు ఈవీవీ తనయుడు అల్లరి నరేష్(Allari Naresh). ఈ టైటిల్ ను వాడే హక్కు ఉన్న అల్లరి నరేష్… తన తరువాత సినిమా కోసం ఈ టైటిల్ ను పరిశీలిస్తున్నాడట.

Allari Naresh Movie Updates

శకుని పాత్రల ఫేమ్ సిఎస్ఆర్ వారసులు ఇటీవల ప్రారంభించిన కొత్త బ్యానర్ లో అల్లరి నరేష్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయి… విడుదలకు రెడీ అవుతోంది. దీనితో ఈ సినిమాకు ‘ఆ ఒక్కటీ అడక్కు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం అల్లరి నరేష్ చేతిలో ఈ సినిమానే కాకా ప్రస్తుతం మరో రెండు సినిమాలు వున్నాయి. కింగ్ నాగార్జునతో కలిసి న ‘నా సామి రంగా’ లో నటిస్తున్న అల్లరి నరేష్… ఇటీవలే ‘బచ్చలమల్లి’ అనే మరో సినిమాను ప్రారంభించాడు. దీనితో అల్లరి నరేష్ నటించిన మూడు సినిమాలు కూడా కొత్త ఏడాదిలోనే విడుదల అయ్యేటట్లు కనిపిస్తున్నాయి.

Also Read : Prabhas: అభిమానులకు ప్రభాస్ సంక్రాంతి సర్ ప్రైజ్ గిఫ్ట్ ?

Allari Naresh
Comments (0)
Add Comment