Allari Naresh : సంక్రాంతి పండుగ వేళ అల్లరి నరేష్ , అమృతా అయ్యర్ కలిసి నటించిన బచ్చలమల్లి మూవీ డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి వచ్చేసింది. గత ఏడాది డిసెంబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాలు అందుకోలేక పోయినా మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటికే అల్లరి నరేష్(Allari Naresh) విభిన్నమైన పాత్రలు పోషించాడు. తనను తాను నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు.
Allari Naresh Bachchala Malli Movie..
ఈ బచ్చలమల్లి మూవీలో డిఫరెంట్ క్యారెక్టర్ పోషించాడు. తనకు పోటీగా ఫిమేల్ రోల్ పోషించిన అమృతా అయ్యర్ కూడా పాత్రకు తగినట్టు పర్ ఫార్మెన్స్ చేసింది. గ్రామీణ వాతావరణ నేపథ్యంలో బచ్చలమల్లిని తెరకెక్కించారు సుబ్బు మంగాదేవి. రాజేష్ దండా నిర్మించగా విప్పర్తి మధు స్క్రీన్ ప్లే వహించాడు. మూవీకి సంబంధించి విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం ఆకట్టుకునేలా ఉంది.
విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది బచ్చలమల్లి. ఈ కథ 1990ల నాటిది. భావోద్వేగాలను పండించేలా చేశాడు డైరెక్టర్. గ్రామీణ నేపథ్యంలో ఎదురయ్యే సవాళ్లను కథానాయకుడు ఎలా ఎదుర్కొన్నాడనే దానిపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు బచ్చలమల్లిలో.
బచ్చలమల్లి పాత్రలో సరి పోయాడు అల్లరి నరేష్. తనకు తల్లిగా రోహిణి నటించింది. పాత్రలు పోషించిన వారంతా సరైన న్యాయం చేశారని చెప్పక తప్పదు. మొత్తంగా ఓటీటీలోకి వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పక తప్పదు.
Also Read : Beauty Sreemukhi Apology : హిందూ సంఘాలకు శ్రీముఖి క్షమాపణ