All We Imagine as Light : గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు నామినేట్ అయిన తొలి భారతీయ మహిళ

ముంబయిలోని ఓ నర్సింగ్‌ హోమ్‌లో పనిచేేస ఇద్దరు నర్సుల కథతో పాయల్‌ కపాడియా తెరకెక్కించిన చిత్రమిది...

All We Imagine as Light : ‘ఆల్‌ వి ఇమేజిన్‌ యాజ్‌ లైట్‌’ ఈ మధ్యకాలంలో సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న చిత్రమిది. పాయల్‌ కపాడియా(Payal Kapadia) దర్శకత్వంలో హిందీ, మలయాళం, మరాఠీ భాషల్లో తెరకెక్కిన డ్రామా ఇది. ఇప్పటికే పలు అంతర్జాతీయ వేదికలపై ఎన్నో అవార్డులు దక్కించుకున్న భారతీయ చిత్రమిది. మే నెలలో కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించారు. అలాగే మరో నాలుగు ఫిల్మ్‌ ఫెస్టివల్స్‌లోనూ ప్రదర్శన జరిగింది. ఇప్పుడీ చిత్రం 82వ గోల్డెన్‌ గ్లోబ్స్‌ పురస్కారాలకు రెండు నామినేషన్స్‌ దక్కించుకుంది. బెస్ట్‌ నాన్‌ ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ మోషన్‌ పిక్చర్‌, బెస్ట్‌ డైరెక్టర్‌ వ్ఘిభాగాల్లో ఈ చిత్రం నామినేషన్లు దక్కించుకోవడం విశేషం. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుకు నామినేట్‌ అయిన తొలి భారతీయ మహిళగా పాయల్‌ కపాడియా రికార్డ్‌ సృష్టించారు.

All We Imagine as Light Got Award

ముంబయిలోని ఓ నర్సింగ్‌ హోమ్‌లో పనిచేేస ఇద్దరు నర్సుల కథతో పాయల్‌ కపాడియా తెరకెక్కించిన చిత్రమిది. కని కుశ్రుతి, దివ్య ప్రభ కీలక పాత్రల్లో నటించారు. గతంలో బెస్ట్‌ నాన్‌ ఇంగ్లీష్‌ ఫిల్మ్‌, బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ (నాటు నాటు) విభాగాల్లో పోటీపడిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం ‘నాటు నాటు’ పాటకు అవార్డు దక్కించుకుంది. పది నామినేషన్లతో ఫ్రెంచ్‌ చిత్రం ‘ఎమిలియా పెరేజ్‌’ దూసుకుపోతుంది. జనవరి 5న ఈ పురస్కార వేడుక జరగనుంది.

Also Read : Hero Gopichand : ఘాజీ దర్శకుడితో సినిమా కు సిద్ధమవుతున్న హీరో గోపీచంద్

All We Imagine as LightAwardsTrendingUpdatesViral
Comments (0)
Add Comment