All We Imagine as Light: భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా తెరకెక్కించిన తాజా సినిమా ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’. కనికస్రుతి, దివ్య ప్రభ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో ఛాయాకందం ఓ కీలక పాత్రలో నటించారు. ఫ్రాన్స్, ఇండియా, నెదర్లాండ్స్, ఇటలీ, లక్సెంబర్గ్ దేశాలు ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్నాయి. ఈ ఏడాది మేలో జరిగిన 77వ కాన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ఈ సినిమాను ప్రదర్శించారు. అయితే ఇప్పుడు ఈ సినిమా ఆస్కార్ బరిలో నిలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
All We Imagine as Light Movie…
కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ ప్రీ అవార్డు సొంతం చేసుకున్న ఈ సినిమాను 2025 ఆస్కార్ బరిలో నిలిపేందుకు మేకర్స్ సన్నాహాలు మొదలు పెట్టారట. ఈ చిత్రాన్ని ఆస్కార్ కు పంపేందుకు ఫ్రాన్స్ దేశం షార్ట్ లిస్ట్ చేసిందని టాక్. ఇక 97వ ఆస్కార్ అవార్డుల వేడుక 2025 మార్చిలో జరగనున్న సంగతి తెలిసిందే.
ఇక ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్(All We Imagine as Light)’ చిత్రం అక్టోబరు 2న ఫ్రాన్స్‌లో రిలీజ్ కానుందని, మలయాళం, హిందీ, మరాఠీ భాషల్లో రూపొందిన ఈ సినిమాను ఇండియాలో హీరో రానా నిర్మాణసంస్థ ‘స్పిరిట్ మీడియా’ డిస్ట్రిబ్యూట్ చేయనుందట. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ముంబైలో పని చేస్తున్న ఇద్దరు కేరళ నర్సులు ప్రభ (కనికస్రుతి), అను (దివ్య) జీవితాల్లో జరిగిన ఘటనల నేపథ్యంలో ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ కథనం సాగుతుంది.
Also Read : Upendra: ఉపేంద్ర బర్త్ డే స్పెషల్ గా పవర్ ఫుల్ పోస్టర్ విడుదల !