Jigra Trailer : అలియా నటించిన ‘జిగ్రా’ ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్

‘బాంబె వెల్వెట్, రమన్ రాఘవ్ 2.0, రుఖ్’ సినిమాలకి స్క్రీన్ రైటర్‌గా...

Jigra : రెండు వారాల క్రితం ఇంటెన్సివ్ టీజర్‌తో ఆకట్టుకున్న ఆలియా భట్ చిత్రం ‘జిగ్రా(Jigra)’. తాజాగా ఈ మూవీ ట్రైలర్ విడుదలైంది. కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్‌తో కలిసి ఆలియా భట్ నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే.. ఈ సినిమా తమ్ముడి కోసం ఎంతకైనా తెగించే సోదరి కథగా తెలుస్తోంది. వైల్డ్ ఇంటెన్స్, ఎమోషనల్ సన్నివేశాలతో ఈ మూవీ ట్రైలర్ ఇప్పుడు యూట్యూబ్‌లో దుమ్ము రేపుతోంది. ఇద్దరు తెలుగు నటులు ఈ సినిమాలో నటించడం విశేషం.

ఇండిపెండెంట్ సినిమాలలో తన మార్క్ రైటింగ్, డైరెక్షన్‌తో సంచలనం సృష్టించిన కథ రచయిత, దర్శకుడు వాసన్ బాల దర్శకత్వంలో ఆలియా భట్, వేదంగ్ రైనా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జిగ్రా(Jigra)’. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ టీజర్ విమర్శకుల నుండి ప్రశంసలు అందుకోగా.. తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్ కూడా బాల స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా ఉన్నట్లు కనిపిస్తోంది. విదేశాల్లో ఓ కేసులో చిక్కుకున్న తన సోదరుడి కోసం ఎంతకైనా తెగించే సత్య అనే అమ్మాయి క్యారెక్టర్లో ఆలియా ఇంటెన్సివ్‌గా కనిపిస్తుంది. ఇక తమ్ముడి క్యారెక్టర్లో జోయా అక్తర్ నెట్‌ఫ్లిక్స్ మూవీ ‘ఆర్చీస్’ ఫేమ్ వేదంగ్ రైనా‌కి ఇది రెండో పెద్ద మూవీ కావడం విశేషం. కాగా ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ని ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేయడం విశేషం. అయితే ఈ మూవీ ఆడియెన్స్‌ని ఎలా మెప్పించనుందో తెలుసుకోవాలంటే మాత్రం వచ్చే నెల 11వ తేదీ వరకు వేచిచూడాల్సిందే.

Jigra Movie Trailer Updates

‘బాంబె వెల్వెట్, రమన్ రాఘవ్ 2.0, రుఖ్’ సినిమాలకి స్క్రీన్ రైటర్‌గా.. ‘పెడ్లర్స్, మర్ద్ కో దర్ద్ నహీ హోతా’ సినిమాలకి దర్శకుడిగా వ్యవహరించి బాలీవుడ్‌లో తనదైన క్రేజ్‌ని సొంతం చేసుకున్న బాల.. 2022‌లో వచ్చిన రాజ్ కుమార్ రావు నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్స్ ‘మోనికా ఓ మై డార్లింగ్’ సినిమాతో హిట్ అందుకోవడమే కాకుండా క్రిటిక్స్ నుండి ప్రశంసలు పొందాడు. ఇక బాలీవుడ్‌లో తిష్ట వేసిన తెలుగమ్మాయి, కాబోయే అక్కినేని కోడలు శోభిత ధూళిపాళ, రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించనుండటం విశేషం.

Also Read : Devara Movie : జాన్వీ కపూర్ పై ఫన్నీ కామెంట్స్ చేసిన తారక్

CinemaJigraTrendingUpdatesViral
Comments (0)
Add Comment