Alia Bhatt: బాలీవుడ్ ను డీప్ ఫేక్ వదలడం లేదు. నేషనల్ క్రష్ రష్మిక మందన్నా డీప్ ఫేక్ వీడియో అప్పట్లో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నటి అలియా భట్ మరోసారి డీప్‌ఫేక్ బాధితురాలిగా మారింది. అలియా ముఖాన్ని మార్ఫింగ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఆ వీడియో మరో నటి వామికా గబ్బికి సంబంధించినదిగా తెలుస్తోంది. గత నెలలో 27న వామిక గబ్బి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేసింది. అందులో ఆమె ఎర్రటి చీరను ధరించి స్లీవ్ లెస్ బ్లౌజ్‌తో కనిపించింది. తాజాగా ఆ వీడియోలో ఆలియా భట్ ఫేస్ ను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ డీప్‌ఫేక్ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ నెటిజన్ షేర్ చేయగా… కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది.
Alia Bhatt in Deep Fake Video Issue
కాగా.. అలియా డీప్‌ఫేక్ ముప్పు బారిన పడడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది నవంబర్‌లో ఆమె ఫేస్‌ను మార్ఫ్ చేసిన వీడియో వైరలైంది. అంతుకుముందే రష్మిక మందన్న, రణవీర్ సింగ్, కత్రినా కైఫ్, నోరా ఫతేహి, అమీర్ ఖాన్, కాజోల్ లాంటి ప్రముఖ తారలు డీప్ ఫేక్ బారిన పడ్డారు.
Also Read : Manchu Vishnu: మలేషియాలో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక !